జగన్ ప్రభుత్వం ఇసుక లభ్యతను నిలిపివేయడం వల్ల రాష్ట్రంలో ఎన్నో దుష్పరిణామాలు సంభవించాయన్నారు పవన్. లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులకు దాదాపు మూడు నెలల నుంచి ఉపాధి లేకుండా పోయిందని జనసేనాని ఎద్దేవా చేశారు.

యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ వెళ్లిపోయారన్నారు. రోడ్ల మీద తిరిగి ఇంత అనుభవం ఉండి జగన్ ఫెయిలయ్యారని.. చిన్న ఇసుక పాలసీని తీసుకురాలేకపోయారని పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు.

రాష్ట్రానికి రూ. 2.58 లక్షల కోట్ల అప్పులున్నాయని.. దీనికి తోడు జగన్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే రూ.50 వేల కోట్లు కావాలని పవన్ తెలిపారు. ఇప్పటికే తెచ్చిన అప్పులకు వడ్డీలు కడుతూ మళ్లీ కొత్త పథకాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

ఇసుక నిలిపివేసి ఆదాయాన్ని కోల్పోయారని.. బిల్లుల చెల్లింపు ఆపేశారని, పీపీఏలను రద్దు చేసి జగన్ మొండిగా వెళ్లడం వల్ల పెట్టుబడిదారుల విశ్వాసాన్ని కోల్పోయారని పవన్ ఆరోపించారు.

ప్రతిష్టాత్మకమైన కియా మోటార్స్ నుంచి తొలి కారు ప్రారంభించేందుకు వచ్చిన కియా సీఈవోను వైసీపీ నేతలు అవమానించారని జనసేనాని మండిపడ్డారు. ఇలాంటి చర్యల వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా అని పవన్ ప్రశ్నించారు.

సంక్షేమ పథకాలకు రూ.50 వేల కోట్లు కావాల్సినప్పుడు.. పారిశ్రామికవేత్తల పట్ల ప్రవర్తించాల్సిన తీరు ఇదేనా అంటూ మండిపడ్డారు. 35 దేశాల నుంచి రాయబారులను పిలిచి వైసీపీ ప్రభుత్వం ఏం సాధించిందని పవన్ ప్రశ్నించారు.

పోలవరం ప్రాజెక్ట్‌తో పాటు మరెన్నో కార్యక్రమాలను నిలిపివేశారని దుయ్యబట్టారు. ఏషియా పల్స్ అండ్ పేపర్ మిల్స్ పరిశ్రమ రూ.24 వేల కోట్ల పెట్టుబడితో ప్రకాశం జిల్లాలో ప్లాంట్ పెట్టేందుకు ప్రయత్నించినప్పుడు.. రాష్ట్రంలో పరిస్థితులను చూసి ఆ కంపెనీ మహారాష్ట్రకు తరలిపోయిందని పవన్ గుర్తు చేశారు.

బందర్ డీప్ పోర్ట్‌ను రద్దు చేసి దానిని తెలంగాణకు డ్రైపోర్ట్‌గా చేద్దామని జగన్ ప్రయత్నిస్తున్నారని.. దీని వల్ల అక్కడి నుంచి వచ్చే ఆదాయం తెలంగాణ ప్రభుత్వానికి వెళ్తుందన్నారు.

ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఎవరి ప్రయోజనాల కోసం నడుపుతున్నారని పవన్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వమంటే.. జగన్ సిమెంట్ ఫ్యాక్టరీలు కావాలని, ఇది ప్రజలదని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. 

బ్రాందీని బొర్న్‌ వీటాలా ప్రమోట్ చేస్తారేమో: జగన్ ప్రభుత్వంపై పవన్ వ్యాఖ్యలు

కోడి కత్తి, వివేకా హత్య కేసులపై... పవన్ ఆసక్తికర కామెంట్స్

గ్రామాల నాశనానికే... గ్రామవాలంటీర్ల వ్యవస్థ: పవన్

రాష్ట్ర ప్రభుత్వమంటే... సిమెంట్ ఫ్యాక్టరీ కాదు: జగన్‌పై పవన్ విసుర్లు

పథకాలు జనరంజకం.. కానీ పాలన జనవిరుద్ధం: జగన్‌పై పవన్ సెటైర్లు

జగన్ పాలనపై 6 నెలల వరకు స్పందించదలచుకోలేదు.. కానీ: పవన్