పథకాలు జనరంజకం.. కానీ పాలన జనవిరుద్ధం: జగన్‌పై పవన్ సెటైర్లు

వైసీపీ వంద రోజుల పాలనలో పారదర్శకత, దార్శనికత లోపించిందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. 100 రోజుల వైసీపీ పాలనను జనవిరుద్ధమైన జనరంజక పాలనగా పవన్ అభివర్ణించారు.

janasena chief pawan kalyan comments on ys jagan over ysrcp manifesto

వైసీపీ వంద రోజుల పాలనలో పారదర్శకత, దార్శనికత లోపించిందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. 100 రోజుల వైసీపీ పాలనను జనవిరుద్ధమైన జనరంజక పాలనగా పవన్ అభివర్ణించారు. వైసీపీ మేనిఫెస్టో, నవరత్నాలు జనరంజకమైనవని.. కానీ వారి పాలన జనవిరుద్ధమైనదని పవన్ ఎద్దేవా చేశారు.

తెలుగుదేశం పార్టీని కూల్చేసిన ముఖ్యాంశాల్లో ఇసుక తవ్వకాలు ప్రధానమైనదని.. మైనింగ్ శాఖకు ఆదాయం లేకుండా అధికార, ప్రతిపక్ష నేతలు ఒక మాఫీయాగా ఏర్పడ్డారన్నారు.

తాము అధికారంలోకి వస్తే ఇసుక మాఫియాను అడ్డుకుంటామని.. ఇసుకను అందరికి అతి తక్కువ ధరకే అందిస్తామని చెప్పిందన్నారు. ఇసుక పాలసీని నిలిపివేస్తున్నామని జగన్ ప్రభుత్వం ప్రకటించిందని.. తన కార్యాలయంలో గోడ కట్టేందుకు ఇసుక లేకపోవడంతో నిర్మాణం నిలిచిపోయిందన్నారు.

తాను భీమవరం వెళ్తుండగా సిద్ధాంతం వద్ద వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు తనను అడ్డుకున్నారని పవన్ గుర్తు చేశారు. ఇసుక లేకపోవడం వల్ల తమకు ఉపాధి పోయిందని వారు చెప్పడంతో తనకు జనం ఇబ్బంది తెలిసిందని జనసేనాని తెలిపారు.

టన్ను ఇసుక రూ.375 అని వైసీపీ ప్రభుత్వం చెబుతోందని.. అయితే డంపింగ్ యార్డ్ వద్ద మరో రూ.525 ఇసుక సూపర్‌వైజర్‌కు ఇవ్వాలని అది ప్రభుత్వానికి వెళ్తుందా లేదా అన్న స్పష్టత కొరవడిందని ఆయన ఎద్దేవా చేశారు. ఇసుక మొత్తం రూ.900 దాకా అవుతుంటే రూ.375 అని చెప్పడం ఎందుకని పవన్ ధ్వజమెత్తారు.  

బ్రాందీని బొర్న్‌ వీటాలా ప్రమోట్ చేస్తారేమో: జగన్ ప్రభుత్వంపై పవన్ వ్యాఖ్యలు

కోడి కత్తి, వివేకా హత్య కేసులపై... పవన్ ఆసక్తికర కామెంట్స్

గ్రామాల నాశనానికే... గ్రామవాలంటీర్ల వ్యవస్థ: పవన్

రాష్ట్ర ప్రభుత్వమంటే... సిమెంట్ ఫ్యాక్టరీ కాదు: జగన్‌పై పవన్ విసుర్లు

పథకాలు జనరంజకం.. కానీ పాలన జనవిరుద్ధం: జగన్‌పై పవన్ సెటైర్లు

జగన్ పాలనపై 6 నెలల వరకు స్పందించదలచుకోలేదు.. కానీ: పవన్

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios