ఏపీ నార్కోటిక్స్ హబ్‌గా మారింది.. ట్విట్టర్‌లో సంచన పోస్టులు చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణ పోలీసుల వీడియోలతో..
ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్ వ్యవహారంపై దుమారం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ నార్కోటిక్స్ హబ్‌గా మారిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఇది దేశం మొత్తం ప్రభావం చూపుతోందని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్ వ్యవహారంపై దుమారం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ నార్కోటిక్స్ హబ్‌గా మారిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఆరోపించారు. ఇది దేశం మొత్తం ప్రభావం చూపుతోందని మండిపడ్డారు. ఏపీ నుంచే గంజాయి సరఫరా అవుతుందంటూ తెలంగాణ పోలీసులు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను ఆయన ట్విట్టర్‌లో షేర్ చేశారు. తన పోరాట యాత్ర సమయంలో ఏవోబీలో గంజాయి వ్యాపారం, మాఫియా గురించి తనకు అనేక ఫిర్యాదులు వచ్చాయని కూడా పవన్ కల్యాణ్ తెలిపారు. వరసు ట్వీట్‌లతో ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
‘ఏపీ నార్కోటిక్స్ హబ్‌గా మారింది & ప్రతి స్థాయిలో చాలా మంది డ్రగ్స్ లార్డ్‌లతో నిండిపోయింది. ఇది దేశం మొత్తం ప్రభావం చూపుతోంది. ప్రభుత్వ ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న నాయకులు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు’ అని పవన్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ చెప్పిన మాటలు చూడండి అంటూ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ఎస్పీ రంగనాథ్ మాట్లాడూత.. గంజాయి AOB ప్రాంతం నుంచి దేశంలోని చాలా ప్రాంతాలకు తరలిస్తున్నారని చెప్పారు. అది వేల కోట్ల బిజినెస్ అని తెలిపారు.
Also read: 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజులు ఏపీలో వర్షాలు..
మరో ట్వీట్‌లో పవన్ కల్యాణ్ హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వీడియోను షేర్ చేశారు. ‘హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ శ్రీ అంజనీ కుమార్.. ఏపీ నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు మాదక ద్రవ్యాలు ఎలా రవాణా చేయబడుతున్నాయో వివరాలను తెలియజేస్తున్నారు’అని పేర్కొన్నారు.
2018లో రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక సమస్యలను అర్థం చేసుకోవడానికి పోరాట యాత్రను చెప్పటినట్టు పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. ఆ సమయంలో ఆంధ్రా ఒరిస్సా సరిహద్దులోని గిరిజన ప్రాంతాల్లో నిరుద్యోగం, అక్రమ మైనింగ్, గంజాయి వ్యాపారం, గంజాయి మాఫియా గురించి తనకు అనేక ఫిర్యాదు వచ్చాయని జనసేనాని తెలిపారు.
Also read: ఫలిస్తున్న ఏపీ సర్కార్ యత్నాలు.. పెరుగుతున్న బొగ్గు నిల్వలు, త్వరలోనే సంక్షోభానికి తెర
అఫ్గనిస్థాన్ నుంచి ఇరాన్ మీదుగా విజయవాడలోని ఆషీ ట్రేడింగ్ కంపెనీ చిరునామాతో టాల్కమ్ స్టోన్స్ ముసుగులో తరలిస్తున్న 2,988 కిలోల హెరాయిన్‌ను సెప్టెంబరు 13న డీఆర్ఐ అధికారులు గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్‌లో పట్టుకున్న సంగతి తెలిసిందే. దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తు ప్రారంభించింది. అయితే ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలు ఏపీ డ్రగ్స్‌కు అడ్డగా మారిందని ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో ఎక్కడ డ్రగ్స్ లభించిన మూలాలు ఏపీలో ఉంటున్నాయని.. ఇది ఆందోళన కలిగించే అంశమని వారు అంటున్నారు. దీనిపై స్పందించిన సీఎం వైఎస్ జగన్.. రాష్ట్రానికి సంబంధం లేని వ్యవహారంపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని అన్నారు.
ఆ తర్వాత తెలంగాణ పోలీసులు ఏపీ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా అవుతాన్నాయని చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ఈ విషయంపై ఇప్పటికే ప్రభుత్వంపై టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఇదిలా ఉంటే ఏపీలో మాదక ద్రవ్యాల నియంత్రణపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని డీజపీ గౌతమ్ సవాంగ్ తాజాగా స్పష్టం చేశారు. అదే విధంగా.. గంజాయి సాగు, రవాణాను అరికట్టేందుకు ఎన్‌ఐఎ సహకారం కూడా తీసుకుంటామని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ముంద్ర పోర్టులో పట్టుబడిన హెరాయిన్‌కి, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో డ్రగ్స్ పట్టుబడినట్లుగా జరుగుతున్న ప్రచారంలో ఏపీకి ఎలాంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేశారు.