Asianet News TeluguAsianet News Telugu

ఫలిస్తున్న ఏపీ సర్కార్ యత్నాలు.. పెరుగుతున్న బొగ్గు నిల్వలు, త్వరలోనే సంక్షోభానికి తెర

ఏపీలో బొగ్గు నిల్వలు ఇప్పుడు క్రమేణా పెరుగుతున్నాయి. కేంద్రంతో చర్చలు.. ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా దాదాపు 22 ర్యాకుల బొగ్గు ప్రతిరోజూ రాష్ట్రానికి వస్తుండగా.. దీనికి మరికొంత నిల్వలు జత చేరుతుండటంతో రాష్ట్రంలో ప్రస్తుతానికి బొగ్గు కొరత తగ్గినట్టేనని ఏపీ జెన్‌కో (apgenco) అధికారులు చెబుతున్నారు. 

increased coal reserves in andhra pradesh
Author
Amaravati, First Published Oct 27, 2021, 10:16 AM IST

దేశవ్యాప్తంగా తలెత్తిన విద్యుత్ సంక్షోభం (electricity crisis) ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పైనా పడుతుందని నిపుణులు హెచ్చరించిన దరిమిలా ఏపీ సర్కార్ వేగంగా స్పందించిన సంగతి తెలిసిందే. సమస్య తీవ్రత దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) దృష్టికి తీసుకెళ్లారు ఏపీ సీఎం వైఎస్ జగన్ (ys jagan) . అలాగే ఎప్పటికప్పుడు సమీక్షలు చేసిన ఆయన.. ఎక్కడ బొగ్గు అందుబాటులో వున్నా కొనుగోలు చేయాలని.. నిధుల సమస్య లేదని అధికారులకు భరోసానిచ్చారు. దీని ఫలితంగానే ఏపీలో బొగ్గు నిల్వలు ఇప్పుడు క్రమేణా పెరుగుతున్నాయి.

ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో (damodaram sanjeevaiah thermal power station) 52,800 మెట్రిక్‌ టన్నుల బొగ్గు నిల్వ ఉంది. ఇది నాలుగు రోజుల ఉత్పత్తికి సరిపోతుంది. అలాగే డాక్టర్‌ నార్ల తాతారావు థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో (narla tata rao thermal power station) ఉన్న 35,300 మెట్రిక్‌ టన్నుల బొగ్గు ఒక రోజుకే సరిపోతున్నప్పటికీ.. రాయలసీమ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో (rayalaseema thermal power plant) 76 వేల మెట్రిక్‌ టన్నుల బొగ్గు ఉండటంతో ఇక్కడ ఐదు రోజులపాటు విద్యుత్‌ ఉత్పత్తి ఆటంకం వుండదని అధికారులు తెలిపారు.

ALso Read:రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష.. ‘కొరత రాకూడదు’

కేంద్రంతో చర్చలు.. ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా దాదాపు 22 ర్యాకుల బొగ్గు ప్రతిరోజూ రాష్ట్రానికి వస్తుండగా.. దీనికి మరికొంత నిల్వలు జత చేరుతుండటంతో రాష్ట్రంలో ప్రస్తుతానికి బొగ్గు కొరత తగ్గినట్టేనని ఏపీ జెన్‌కో (apgenco) అధికారులు చెబుతున్నారు. విదేశాల నుంచి, ఇతర మార్గాల్లో భవిష్యత్‌ అవసరాల కోసం దాదాపు 10 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల బొగ్గు నిల్వలను సేకరించే పనిలో రాష్ట్ర ప్రభుత్వం వుంది. 

మరోవైపు బొగ్గు కొరత కారణంగా దేశవ్యాప్తంగా తాత్కాలికంగా మూతపడ్డ థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు క్రమంగా తెరుచుకుంటున్నాయి. విద్యుత్‌ ఉత్పతి రంగాలకు మినహా ఇతర అవసరాలకు కేంద్రం ఇప్పటికే బొగ్గు సరఫరా నిలిపివేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కోల్‌ ఇండియా లిమిడెడ్‌ (coal india limited) ఆధ్వర్యంలోనే దేశవ్యాప్తంగా బొగ్గు సరఫరా మొదలుపెట్టడంతో పాటు విద్యుత్, బొగ్గు, రైల్వే శాఖల కేంద్ర మంత్రులు ప్రతిరోజూ థర్మల్‌ కేంద్రాలకు బొగ్గు కేటాయింపులు జరుపుతున్నారు. దేశవ్యాప్తంగా వున్న మొత్తం 135 థర్మల్‌ కేంద్రాల్లో 93 కేంద్రాలు బొగ్గు కొరత ఎదుర్కొంటున్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios