24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజులు ఏపీలో వర్షాలు..
ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజులు వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ బంగాళాఖాతంలో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజులు వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ బంగాళాఖాతంలో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఆగ్నేయ బంగాళాఖాతం (Bay of Bengal), దాని పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం విస్తరించింది. ఇది పశ్చిమదిశగా ప్రయాణించే అవకాశం ఉందని, దీనివల్ల అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర బంగాళాఖాతం వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ద్రోణి విస్తరించిందని పేర్కొంది.
ఈ ప్రభావంతో ఏపీలో రాగల 48 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Rains in AP) కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిసింది. మరోవైపు దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు సోమవారం పూర్తిగా తిరోగమించాయి. అయితే ఈ ఏడాది ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు తిరోగమించాయని వాతావరణ శాఖ తెలిపింది. దిగువ ఉష్ణ మండల స్థాయిల్లో ఈశాన్య గాలులు ఏర్పడడంతో.. ఈశాన్య రుతుపవనాలు (North East Monsoon) వచ్చాయని వాతావరణ శాఖ పేర్కొంది.
Also read: జగన్ సర్కార్ కీలక ఉత్వర్వులు.. ఆ కుటుంబాలకు రూ.50 వేలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో అక్టోబర్ 26 నుంచి 30 వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, మహేలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. అక్టోబర్ 29,30 తేదీల్లో కర్ణాటక, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని, కోస్తాంధ్రలో అక్టోబర్ 28 నుంచి 30 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వరకు దక్షిణాది రాష్ట్రాల్లో ఈశాన్య రుతుపవనాలు ప్రభావం చూపనున్నాయి. అయితే ఈశాన్య రుతుపవనాల ప్రభావం సాధారణంగానే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.