జగన్ వ్యాఖ్యల ఎఫెక్ట్: కాపులకు రిజర్వేషన్లపై నిపుణులతో పవన్ చర్చలు

Janasena chief pawan Kalyan plans to discussion with experts over kapu reservation
Highlights

కాపుల రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొంటున్నారని  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  అభిప్రాయపడ్డారు. అర్హులైన వారందరికీ రాజకీయ ఫలాలు అందాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

అమరావతి: కాపుల రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొంటున్నారని  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  అభిప్రాయపడ్డారు. అర్హులైన వారందరికీ రాజకీయ ఫలాలు అందాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

మంగళవారం నాడు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కాపు రిజర్వేషన్ల విషయమై ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య కొనసాగుతున్న మాటల యుద్దంపై స్పందించారు.  ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 

కాపు రిజర్వేషన్ల విషయమై  చంద్రబాబునాయుడు తీరును ఆయన తప్పుబట్టారు. కులాల మధ్య చిచ్చు రేపేలా చంద్రబాబునాయుడు మాట్లాడుతున్నారని పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. కాపులకు రిజర్వేషన్ల విషయమై  వైసీపీ చీఫ్  వైఎస్ జగన్  ఏడాదికో మాట మారుస్తున్నారని చెప్పారు.  కాపుల రిజర్వేషన్ల విషయమై  కాంగ్రెస్, టీడీపీలకు చిత్తశుద్ది లేదన్నారు.

కాపుల రిజర్వేషన్ల అంశాన్ని అధికార, విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని పవన్ మండిపడ్డారు.అంతేకాదు కాపుల రిజర్వేషన్ విషయమై కాంగ్రెస్, టీడీపీలకు చిత్తశుద్ది లేదన్నారు. మంగళవారం నాడు జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీతో పవన్ కళ్యాణ్ తొలిసారిగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కాపుల రిజర్వేషన్ అంశంపై చర్చించారు.  ఈ విషయమై  అధ్యయనం చేసేందుకుగాను నిపుణులతో చర్చించాలని  ఆయన భావిస్తున్నారు. 

 

ఈ వార్తలు చదవండి 

1.కాపు రిజర్వేషన్: వైసీపీ మద్దతు, యూ టర్న్ మా ఇంటా వంటా లేదు: జగన్

2.కాపు రిజర్వేషన్లపై జగన్ మాట మార్చారు: చంద్రబాబు

loader