అమరావతి: ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా మరోసారి నిప్పులు చెరిగారు. మా తెలుగుతల్లిని కాపాడాల్సిన మీరే తెలుగు భాష తల్లినే చంపేస్తున్నారు అంటూ జగన్ పై మండిపడ్డారు. 

తెలుగు భాషా సరస్వతిని అవమానించకండి అంటూ హితవు పలికారు. ఇంగ్లీష్ భాషను వద్దని ఎవరూ చెప్పడం లేదని తెలుగు మాతృ భాష పరిరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వైసీపీ నాయకుడు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ రెడ్డి స్పష్టం చేయాలని తెలిపారు. 

మాతృభాషని,  మాండలికాలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. తెలుగు రాష్ట్రాన్ని ఏలుతూ, తెలుగు పేపర్ నడుపుతూ, తెలుగుని చంపేసే ఆలోచన భస్మాస్ముర తత్వాన్ని సూచిస్తుందని మండిపడ్డారు పవన్ కళ్యాణ్. 

ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టింది. ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెడుతూ కేబినెట్ తీర్మాణం చేసింది. అందుకు సంబంధించి ఒక ఐఏఎస్ అధికారిని సైతం నియమించింది. 

అలాగే ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెడుతూనే తెలుగు సబ్జెక్టు కంపల్సరీ అంటూ సీఎం వైయస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆనాటి నుంచి ప్రభుత్వ తీరుపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం వల్ల తెలుగుభాషను చంపేస్తున్నారంటూ ఆరోపిస్తున్న సంగంతి తెలిసిందే. 

 

ఈ వార్తలు కూడా చదవండి

ఆంగ్ర పత్రికల కథనాలను పోస్ట్ చేసి జగన్ ను ఏకేసిన పవన్ కల్యాణ్

మీడియం రగడ: చంద్రబాబు, పవన్ లపై రోజా ఆగ్రహం

ఇంగ్లీష్ మీడియం చదువులు మీ పిల్లలకే నా ? పేద పిల్లలకు వద్దా..!: సీఎం జగన్