Asianet News TeluguAsianet News Telugu

''గ్రామాల డబ్బు గ్రామాల్లోనే ఉండాలి... అదెలా సాధ్యమంటే''

ప్రకృతి వ్యవసాయం గురించి అందరికీ తెలియాల్సిన అవసరం వుందని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 

janasena chief  pawan kalyan comments on natural farming
Author
Vijayawada, First Published Sep 7, 2020, 10:06 PM IST

అమరావతి: ప్రకృతి వ్యవసాయం గురించి అందరికీ తెలియాలని... ఈ తరహా సాగు విధానంతో చిన్నపాటి భూమిలో ఒక కుటుంబంలో నలుగురూ కలిసి పని చేసుకొంటే ఎంత ఆదాయం వస్తుంది అనే ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రకృతితో ముడిపడిన ఈ వ్యవసాయం విధానం అవసరం, విశిష్టత గురించి తెలిపే అనుభవం విజయరామ్ కి ఉందన్నారు. 

ప్రకృతి వ్యవసాయ విధానం గురించి విజయరామ్ మాట్లాడుతూ ''ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పే ముందు  నేను ముందు ఆచరించాలి...తర్వాత చెప్పాలి అని కృష్ణా జిల్లాలో ఆరు ఎకరాలు కొని అక్కడ చెరువు తవ్వాను. శ్రీ పాలేకర్ గారు చెప్పే విధానంలో 10 శాతం చెరువు. 10 శాతం అడవి అంటారు ఎక్కడైనా సరే.. నేను ముందుగా చెరువు తవ్వుకున్నాను. మనం మాగాణులు అంటే చాలా మంచిది అనుకుంటాం. అవి వరికి అనుకూలం. వైవిద్యం అంటే తెలంగాణ, రాయలసీమల్లోనే బతికుంది. మెట్ట సేద్యం మంచిది. ప్రకృతి వ్యవసాయాన్ని మాగాణిలో కూడా మేం రూపొందిస్తున్న ఫైవ్ లేయర్ మోడల్ ప్రకారం చేసుకోవచ్చు'' అని అన్నారు. 

read more   అంతర్వేది స్వామివారి రథం దగ్ధం... జగన్ సర్కార్ సీరియస్, ఈవోపై వేటు

''పాలేకర్ ఒక మాట చెబుతారు – గ్రామం డబ్బులు గ్రామంలోనే ఉండాలి... నగరాల డబ్బులు గ్రామాలకు రావాలి అంటారు. యూరియా, డి.ఎ.పి. కలుపు మందులు, పురుగు మందులు, ట్రాక్టర్లు, స్పేర్ పార్టులు, డీజిల్ ఆయిల్.. ఇలా ఏదైతేనేం ఒక గ్రామం నుంచి రూ.16 లక్షలు విదేశాలకు వెళ్తున్నాయి. భారత దేశంలో ఇలాంటి గ్రామాలు 6 లక్షలు ఉన్నాయి. రెండవది అందరికి అన్నంపెట్టే రైతుకి అన్నం దొరకడం లేదు. 15 సంవత్సరాల్లో 3 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు'' అని పేర్కొన్నారు. 

''భారత దేశానికి ఈ ప్రపంచంలోనే ఇప్పటికీ అతి గొప్ప స్థానం ఉంది. గురు స్థానంలో ఉంది. ఎందుకు అంటే 75 శాతం జీవ వైవిద్యం భారత దేశానికి భగవంతుడు ఇచ్చి, మిగిలిన దేశాలకు 25 శాతం ఇచ్చాడు. ఇక్కడున్నది సమ శీతోష్ణస్థితి. కాలానికి తగ్గట్టు పండ్లు, ఫలసాయాన్ని ఇచ్చాడు భగవంతుడు. ఇది మీకు బయట దేశాల్లో చూసుకుంటే విపరీతమైన చలి లేదా విపరీతమైన ఎండ.  శ్రీ పాలేకర్ గారు గత 38 సంవత్సరాలుగా 40 లక్షల మంది రైతులకు శిక్షణ ఇచ్చారు. అందులో నేను ఒక్కడిని. 40 లక్షలు అనుకున్నా కూడా చాలా పెద్ద సంఖ్యలా కనబడుతుంది గానీ, దేశ జనాభాతో మనం చూస్తే ఒక్క శాతం లేదు. శ్రీ పవన్ కల్యాణ్ గారు నాతో మాట్లాడినప్పుడు ఇది నేను రాజకీయాల గురించి చేయడం లేదు. ఇది నా బాధ్యత అన్నారు'' అని విజయరామ్ వెల్లడించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios