27 ఏళ్ళల్లో జాతీయ పార్టీ కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీలకు అధ్యక్షునిగా పనిచేసాను అని అన్నారు. జలీల్ ఎప్పుడైతే ఆమాటలు చెప్పారో సభలో ఉన్నవారంతా గట్టిగా తప్పట్లు కొడుతూ నవ్వేసారు.
జలీల్ ఖాన్ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగానే కాకుండా వైసీపీకి కూడా అధ్యక్షునిగా చేసారట. విజయవాడలో ముస్లింలకు ఈరోజు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఆ సందర్భంగా చంద్రబాబునాయుడు కూడా హాజరయ్యారు. ఆ సమయంలో జలీల్ ఖాన్ మాట్లాడుతూ, ‘సార్ నేను 27 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాను‘ అని చెప్పారు. ఈ 27 ఏళ్ళల్లో జాతీయ పార్టీ కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీలకు అధ్యక్షునిగా పనిచేసాను అని అన్నారు. జలీల్ ఎప్పుడైతే ఆమాటలు చెప్పారో సభలో ఉన్నవారంతా గట్టిగా తప్పట్లు కొడుతూ నవ్వేసారు. తన గురించి కాస్త ఆలోచించండి సార్ అంటూ మరీ చంద్రబాబును బ్రతిమయలాడుకున్నారు. అయితే, చంద్రబాబుకు ఏం చెప్పాలో అర్ధం కాక మౌనంగా ఉండిపోయారు.
అంతేకాకుండా 2009 ఎన్నికల్లో టిడిపి తరపున మూడు నియోజకవర్గాల్లో ఎంఎల్ఏలు, ఒక ఎంపి ఓడిపోతే తాను మాత్రం గెలిచానన్నారు. గతంలో బికాంలో ఫిజిక్స్ చదివానని చెప్పి జాతీయ స్ధాయిలో పాపులరైపోయిన జలీల్ మళ్ళీ కాంగ్రెస్, వైసీపీలకు అధ్యక్షునిగా చేసానని చెప్పటం గమనార్హం.
