జలీల్ ఖాన్ ఇంటర్వ్యూ తర్వాత సోషల్ మీడియాలో బీకాంలో ఫిజిక్స్ పేరుతో వందల పేజీలు కూడా పుట్టుకొచ్చాయంటే ఆయన ఏ స్థాయి సెలబ్రెటీ అయ్యారో ఇట్టే చెప్పొచ్చు. కానీ, ఇప్పుడు ఆ మాటలే ఆయన పదవికి ఎసరు పెట్టాయట.
జలీల్ ఖాన్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ, బీకాంలో ఫిజిక్స్ అంటే ఇప్పుడు దేశమంతా ఠక్కున చెప్పేస్తుంది.
సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నడూ తన నియోజకవర్గ ప్రజలకు తప్ప ఇతరులకు పెద్దగా తెలియని జలీల్ ఖాన్ కేవలం ఒకే ఒక్క మాటతో దేశమంతా మోస్టు పాపులర్ అయిపోయారు.
తన వాగ్దాటితో యావత్తు జాతీయ మీడియాను కూడా ఆకర్షించారు.
అసలు జలీల్ ఖాన్ ఇంటర్వ్యూ తర్వాత సోషల్ మీడియాలో బీకాంలో ఫిజిక్స్ పేరుతో వందల పేజీలు కూడా పుట్టుకొచ్చాయంటే ఆయన ఏ స్థాయి సెలబ్రెటీ అయ్యారో ఇట్టే చెప్పొచ్చు. కానీ, ఇప్పుడు ఆ మాటలే ఆయన పదవికి ఎసరు పెట్టాయట.
ఆ రోజు ఆ ఇంట్వర్యూలో మాట్లాడిన మాటలకు ఇప్పుడు జలీల్ ఖాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందట.
ఇంతకీ విషయం ఏంటంటే తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు తన మంత్రివర్గాన్ని విస్తరించిన విషయం తెలిసిందే.
సామాజిక సమీకరణ నేపథ్యంలో అన్ని కులాలు, మతాలకు ప్రాతినిథ్యం వచ్చేలా మంత్రివర్గ కూర్పు జరిగిందట. అయితే ముస్లిం సామాజిక వర్గం నుంచి ఒక్కరు కూడా ఏపీ కేబినెట్ లో లేరు. ఆ లోటు భర్తీ చేయాలంటే జలీల్ ఖాన్ ను మంత్రివర్గంలోకి తీసుకోవాలి. కానీ, ఆయన బీకాంలో ఫిజిక్స్ తో దేశవ్యాప్తంగా పాపులర్ కావడంతో చంద్రబాబు వెనక్కితగ్గారట. లేకుంటే జలీల్ ఖాన్ ఇప్పుడు మంత్రి అయ్యేవారు.
పాపం... ఒకే ఒక్క మాట ఆయనకు మంత్రి పదవి దక్కకుండా చేసింది. దీంతో బీకాంలో ఫిజిక్స్ ఎంతపని చేసిందో అని నెటిజన్లు తెగ బాధపడితోన్నారు. జలీల్ ఖాన్ కు తమ సానుభూతిని తెలుపుతున్నారు.
