Asianet News TeluguAsianet News Telugu

‘‘ మీరే సీఎంగా ఉండాలి.. థాంక్యూ సోమచ్‌ జగన్‌ మావయ్య’’: విద్యా దీవెన అందుకున్న వేళ విద్యార్ధిని వ్యాఖ్యలు

జగనన్న విద్యా దీవెన పథకాన్ని అందుకున్న ఓ విద్యార్ధిని ముఖ్యమంత్రి జగన్‌ని ప్రశంసలతో ముంచెత్తింది. గుంటూరు నుంచి విద్యా దీవెన లబ్ధిదారు అయిన బీటెక్‌ విద్యార్థిని సుమిత్ర వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డితో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది.

jagananna vidya deevena beneficiary praises ap cm ys jagan ksp
Author
Amaravathi, First Published Jul 29, 2021, 4:01 PM IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గురువారం జగనన్న విద్యా దీవెన పథకం రెండో విడత సొమ్మును విడుదల చేసింది. ఈ సందర్భంగా గుంటూరు నుంచి విద్యా దీవెన లబ్ధిదారు అయిన బీటెక్‌ విద్యార్థిని సుమిత్ర వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డితో మాట్లాడింది. విద్యా దీవెన, వసతి దీవెన కార్యక్రమాల వల్ల విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని ఆమె తెలిపింది. ఎంతో ధైర్యంగా.. ఏమాత్రం తడబాటు లేకుండా.. పూర్తిగా ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతూ.. అక్కడున్నవారందరిని ఆశ్చర్యపరిచి ఏకంగా సీఎం జగన్‌ ప్రశంసలు పొందింది. 

ALso Read:నా ప్రతి అడుగు పేద విద్యార్థుల కోసమే: జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల

సుమిత్ర ఏమన్నారంటే.. ‘‘విద్యా దీవెన, వసతి దీవెన కార్యక్రమాలు ప్రారంభించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఉన్నత విద్య అభ్యసించాలనుకునేవారికి ఈ పథకాలు ఎంతో మేలు చేస్తాయని ప్రశంసించింది. గతంలో ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ కింద కేవలం 33 వేల రూపాయాలు మాత్రమే వచ్చేవని.. ఇప్పుడు మీరు పూర్తిగా వంద శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నారని సుమిత్ర అన్నారు. అది కూడా విద్యార్థుల తల్లుల ఖాతాలోనే జమ చేయడం ఎంతో బాగుందని.. వసత దీవెన వల్ల తాము తల్లిదండ్రుల మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయిందని సుమిత్ర అన్నారు. ఏపీఎస్‌ఎస్‌డీసీ ద్వారా మా కోర్సులకు సంబంధించిన ఎక్స్‌ట్రా స్కిల్స్‌ అందిస్తూ.. ఉద్యోగ సాధనలో ఎంతో మేలు చేస్తున్నారని ఆమె చెప్పారు. తమ కోసం ఇన్ని చేస్తున్న మీరు మరిన్ని ఏళ్లు సీఎంగా కొనసాగాలని కోరుకుంటున్నాను. థాంక్యూ సోమచ్‌ మావయ్య అంటూ ఆ విద్యార్ధిని ముగించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios