వైసీపీలోకి వెళ్లాలనుకున్న ఆనం.. జగన్ దిమ్మతిరిగే షాక్?

jagan shock to anam ramanarayana reddy
Highlights

తాను పోటీచేయాలనుకున్న నియోజకవర్గం కన్ ఫామ్ అయితే.. వెంటనే పార్టీ మారాలని ఆయన భావిస్తున్నారు. కానీ.. ఇంతలోనే ఆనంకి దిమ్మతిరిగే షాక్ తగిలింది.

ఆనం రామానారాయణ రెడ్డి.. టీడీపీ ని వీడి.. వైసీపీలోకి వెళ్లాలనుకుంటున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా ఆయన పార్టీ మారేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారు. తాను పోటీచేయాలనుకున్న నియోజకవర్గం కన్ ఫామ్ అయితే.. వెంటనే పార్టీ మారాలని ఆయన భావిస్తున్నారు. కానీ.. ఇంతలోనే ఆనంకి దిమ్మతిరిగే షాక్ తగిలింది.

 ఇంతకీ మ్యాటరేంటంటే.. బిజేపీ నేత నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. గత కొంతకాలంగా ఆయన పార్టీ మారతారనే వార్తలు వినపడుతున్నాయి. దీనిని అడ్డుకునేందుకు ఆయనకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవిని కూడా కట్టబెట్టారు. అయితే.. ఆ పదవిని ఖాతరు చేయకుండా నేదురుమల్లి వైసీపీలో చేరేందుకే సిద్ధమయ్యారు.

ఆదివారం ఆయన తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న జగన్ ని కలిసి సమావేశయ్యారు. దాదాపు 20 నిమిషాలపాటు చర్చించారు. ఇక రేపో మాపో పార్టీలో చేరడమే తరువాయి. అయితే.. ఇక్కడే అసలు ట్విస్టు ఉంది. ఏ నియోజకవర్గం కోసం అయితే.. ఆనం ఎదురు చూస్తున్నాడో.. అదే నియోజకవర్గం సీటుని నేదురుమల్లికి ఇస్తానని జగన్ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ ఇద్దరు నేతలు వెంకటగిరి నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే.. నేదురుమల్లికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం ఊపందుకుంది. అదే నిజం అయితే.. ఆనం రామనారాయణ రెడ్డికి షాక్ తగిలినట్టే. ఇక్కడ టీడీపీలో గుర్తింపులేదని వైసీపీలోకి వెళదామని భావిస్తే.. అక్కడ పార్టీలో చేరకముందే చేదు అనుభవం ఎదురైంది. మరి ఆనం నెక్ట్స్ స్టెప్ ఏం తీసుకుంటారో చూడాలి.  

loader