అమరావతి: మెరుగైన జీతాలు నేరుగా ఉద్యోగుల బ్యాంకు ఖాతాలకు అందిస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. గతంలో ఈ రకమైన పరిస్థితి ఉండేది కాదన్నారు సీఎం. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడ ప్రతి నెల జీతాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.  ఆప్కాప్ ద్వారా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు అందిస్తామని ఆయన తెలిపారు. 

శుక్రవారం నాడు అమరావతిలో ఔట్ సోర్సింగ్ సర్వీసుల కార్పోరేషన్ ను ఏపీ సీఎం వైఎస్ జగన్  ప్రారంభించారు.ఔట్  సోర్సింగ్ ఉద్యోగాల్లో 50 శాతం ఉద్యోగాలు మహిళలకే కేటాయించనున్నట్టుగా ఆయన  స్పష్టం చేశారు. ఎవరికీ లంచాలు ఇవ్వకుండానే ఉద్యోగాలు దక్కుతాయన్నారు. 

also read:జగన్ మరో గుడ్‌న్యూస్: రేపు 47వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నియామక పత్రాలు

గత ప్రభుత్వ హాయంలో ఉద్యోగాలు, జీతాల కోసం లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేదని ఆయన పరోక్ష్ంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. 

ఎస్సీ, ఎస్టీ,  బీసీ,మైనార్టీలు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో ఉన్నారని ఆయన తెలిపారు. ఇవాళ 50,449 మందికి ఔట్  సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన నియామక పత్రాలను ప్రభుత్వం అందించింది.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్యను ప్రతి ఏటా పెంచుతామని ఆయన వివరించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఈఎస్ఐ, పీఎఫ్ క్రమం తప్పకుండా చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఉద్యోగులు బాగా పనిచేసినంత కాలం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏమాత్రం ఇబ్బందులు ఉండవని ఆయన హామీ ఇచ్చారు.