రెండవ రోజు ప్రచారంలో చంద్రబాబు పై జగన్ ఫైర్. అవినీతి సొమ్మును నంద్యాల్లో సంచుతున్నారని ఆరోపణ. అతినీతి బాబకు ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపు.
నంద్యాల్లో అధికార పార్టీ వందల కోట్ల అవినీతి సొమ్మును ఖర్చుచేస్తుందని మండిపడ్డారు వైసీపి అధినేత జగన్. ఎన్నికలు అనగానే ప్రజలను డబ్బుతో మభ్యపెట్టడానికి కేబినేట్ అంతా ప్రయత్నాలు ప్రారంభించారని ఆయన విరుచుకుపడ్డారు. నంద్యాల ఉప ఎన్నికలో భాగంగా రెండోరోజు చాబ్రోలు, సాంబవరం, దిగుబండ్ల రోడ్‌షోలలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పాలనపై ధ్వజమెత్తారు.
చంద్రబాబు ఎన్నికల కోసం నంద్యాల్లో నాటకాలు ప్రారంభించారని, తన నిజమైన నైజం మరోకటని జగన్ ఆరొపించారు. సొంత మామను వెన్నుపోటు పొడిచిన బాబు ప్రజలను వెన్నుపోటు పొడవటంలో పెద్ద విశేషం కాదన్నారు. బాబు చేసిన అవినీతి బయటికి రాకుండా ఎంత జాగ్రత్త పడ్డా.. ప్రజలు గమనిస్తున్నారని పెర్కొన్నారు. ప్రజలు తప్పకుండా ఆయనకు గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జగన్ అన్నారు.
చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదని అందుకే ఆయన వైసీపి నేతలను కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు జగన్. ప్రజలు నమ్మకపోవడానికి కారణం తన మూడున్నరేళ్ల పాలనలో ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకపోవడమే అని ఆయన పెర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి జరగడం లేదని, జరుగుతున్నదంతా అన్యాయం, అవినీతే అని ఆయన విమర్శించారు. టీడీపీ పార్టీలో అవినీతికి పరాకాష్టకు చేరిందని ఆరొపించారు జగన్.
లేని అభివృద్దిని ఉన్నట్లు బాబు ప్రజలకు చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ ఎన్నీకల్లో టీడీపీ ఓటమితోనే సరైనా గుణపాఠం చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. నంద్యాల ఉప ఉన్నికలు న్యాయానికి,అన్యాయినికి మధ్య పోరని ఆయన తెలిపారు. ప్రజలు తప్పకుండా న్యాలయం వైపు నిలబడుతారని విశ్వాసం వ్యక్తం చేశారు.
