Asianet News TeluguAsianet News Telugu

‘పాల‌న‌లో జ‌గ‌న్ ఫెయిల్.. నేను ప్రధాని కావాల‌ని 18 పార్టీలు కోరుతున్నాయి’ - కేఏ పాల్‌

సీఎం జగన్ ఏపీని పాలించడంలో విఫలం అయ్యారని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. తాను ప్రధానిగా ఉండాలని దేశంలోని 18 పార్టీలు కోరుకుంటున్నాయని చెప్పారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

Jagan failed in governance.. 18 parties want me to become PM - KA Paul
Author
Ananthapuram, First Published Aug 5, 2022, 9:51 AM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని ప‌రిపాలించ‌డంలో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విఫ‌లం అయ్యారని ప్ర‌జా శాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ అన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారాన్ని సొంతం చేసుకున్న జ‌గ‌న్.. రాష్ట్రానికి పెద్ద‌గా చేసింది ఏమీ లేద‌ని విమ‌ర్శించారు. అయితే ఇప్పుడు ఆయ‌న త‌న‌ని వ‌చ్చి క‌లిస్తే బాగుంటుంద‌ని అన్నారు. లేక‌పోతే ఆయ‌నే న‌ష్ట‌పోతార‌ని తెలిపారు.

భార్యపై అనుమానం.. గొంతు పిసికి చంపి, కాలువలో విసిరేసి...మిస్సింగ్ డ్రామా...

అనంత‌పురంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో కేఏ పాల్ మాట్లాడారు. సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ స‌మ‌యంలో త‌నను వ‌చ్చి క‌ల‌వాల‌ని చెప్పారు. ఇలా చేస్తే తాను తెలంగాణ‌కు సీఎం అవుతాన‌ని, ఏపీలో మ‌ళ్లీ జ‌గ‌న్ సీఎం అవ‌కాశం ఉంటుంద‌ని అన్నారు. లేక‌పోతే ఆయ‌నకే న‌ష్టం ఎక్కువ‌గా ఉంటుంద‌ని కేఏ పాల్ చెప్పారు. 

భరత్‌ను గెలిపిస్తే.. మంత్రిగా పంపిస్తా : కుప్పం వైసీపీ కార్యకర్తలతో జగన్

ఏపీ జ‌నాభాలో కొంత శాతమే ఉన్న కొన్ని వ‌ర్గాలు మాత్ర‌మే అధికారాన్ని అనుభ‌విస్తున్నాయ‌ని అన్నారు. అధిక సంఖ్య‌లో ఉన్న బీసీ, ఎస్సీ, మ‌హిళ‌లు సీఎంలు కాకూడ‌దా అని అని కేఏ పాల్ అన్నారు. కొన్ని కుటుంబాలే అధికారం చ‌లాయిస్తూ సంప‌ద‌ను తీసుకుంటున్నార‌ని తీవ్రంగా ఆరోప‌ణ‌లు చేశారు. ఈ మీడియా స‌మావేశం సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యాన్ని కూడా కేఏ పాల్ ప్ర‌స్తావించారు. పులి లాంటి త‌న వ‌ద్ద ఉండాల‌ని అనుకుంటున్నారా ? లేక పిల్లి లాంటి చంద్ర‌బాబు వ‌ద్ద ఉండాల‌ని భావిస్తున్నారా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆలోచించుకోవాల‌ని సూచించారు.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. వైవీ సుబ్బారెడ్డి సమీక్ష, భక్తులకు కీలక సూచనలు

శ్రీలంక ఆర్థిక వ్య‌వ‌స్థ కుటుంబ పాల‌న వ‌ల్ల‌నే సంక్షోభంలో ప‌డింద‌న్న కేఏ పాల్.. తెలంగాణ‌కు అదే ప‌రిస్థితి వస్తుంద‌ని విమ‌ర్శించారు. ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్రంలో కూడా కుటుంబ పాల‌న కొన‌సాగుతోంద‌ని ఆరోపించారు. టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మ‌రో సారి సీఎం అవ్వ‌లేర‌ని జ్యోస్యం చెప్పారు. ఈ సారి తానే తెలంగాణ సీఎం అవుతాన‌ని అన్నారు. సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వెంట‌నే.. 6 నెల‌ల స‌మ‌యంలో తెలంగాణ రాష్ట్రానికి ల‌క్ష కోట్ల రూపాయిలను తీసుకొని వ‌స్తాన‌ని ధీమా వ్య‌క్తం చేశారు. బీజేపీ ఒక రిలీజియ‌న్ పార్టీ అని ఆరోపించారు. ఆ పార్టీతో క‌లిస్తే ఎలాంటి అభివృద్ధీ జ‌ర‌గ‌బోద‌ని తెలిపారు. కాంగ్రెస్ దేశంలోనే పెద్ద అవినీతి పార్టీ అని తీవ్రంగా ఆరోపించారు. మ‌న దేశ వ్యాప్తంగా ఉన్న 18 పార్టీలు త‌న‌ను పీఎంగా ఉండాల‌ని కోరుతున్నాయ‌ని కేఏ పాల్ చెప్పారు. తాను ప్రధానమంత్రిని అయితే దేశాన్ని చ‌క్క‌గా పాలిస్తాన‌ని, మంచి అభివృద్ధి చేసి చూపిస్తాన‌ని హామీ ఇచ్చారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios