Asianet News TeluguAsianet News Telugu

విశాఖలో ప్రమాణ స్వీకారమా.. ? జగన్ పగటి కలలు కంటున్నాడు - అచ్చెన్నాయుడు

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ రెడ్డి ఎన్నికల వేల ఉత్తరాంధ్రపై ప్రేమ వెలగబోస్తున్నాడని ఆరోపించారు. ప్రఖ్యాత కంపెనీలను విశాఖ నుంచి తరమేశారని అన్నారు. 

Jagan daydreams of taking oath in Visakhapatnam : Atchennaidu..ISR
Author
First Published Mar 5, 2024, 4:36 PM IST

వచ్చే ఎన్నికల అనంతరం విశాఖ నుంచి పాలన సాగిస్తానని, మళ్లీ గెలిచి వచ్చాక విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పగటి కలలు కంటున్నారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు విమర్శించారు. జగన్ ను రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని ఒక్క ఏపీ ప్రజలే కాదు.. యావత్ ఏపీ ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. విశాఖ మీద అంత ప్రేమ ఉన్న జగన్ రెడ్డికి పరదాలు కట్టుకొని తిరగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు.

హైకోర్టు న్యాయమూర్తి రాజీనామా.. మార్చి 7న బీజేపీలో చేరిక..

బటులు లేనిదే అడుగులు కూడా వేయలేని జగన్ రెడ్డి ఎన్నికల వేల ఉత్తరాంధ్రపై ప్రేమ వెలగబోస్తున్నాడని అచ్చెన్నాయడు ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ రెడ్డి, ఆయన చెడ్డీ గ్యాండ్ 5 ఏళ్లల్లో విశాఖలో రూ.40వేల కోట్ల భూదోపిడీకి జగన్ రెడ్డి అతని చెడ్డి గ్యాంగ్ పాల్పడ్డారని ఆరోపించారు. ప్రఖ్యాత లూలూ, ఐబీఎం వంటి కంపెనీలను విశాఖ నుంచి తరిమేశారని, యువతకు ఉపాధి అవకాశాలను దూరం చేశారని ఆయన అన్నారు. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు.

కర్ణాటకకు వరుస బాంబు బెదిరింపులు.. అధికార యంత్రాంగం అలెర్ట్.. దర్యాప్తు ప్రారంభం..

కేంద్ర పర్యావరణ శాఖ వద్దని చెప్పినా వినకుండా రుషికొండను ఆక్రమించి కొండకు గుండు కొట్టి ప్యాలెస్‌లు నిర్మించుకున్నాయని అచ్చెన్నాయుడు విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో ఐటీ రంగంలో రూ.1027.86 కోట్ల పెట్టుబడులతో 175 కంపెనీల ద్వారా 30,428 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఉత్తరాంధ్ర అభివృద్ధికి బాటలు వేశామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ చిత్రపటం నుంచి రాజధానిగా అమరావతిని చెరిపేయటంతో పాటు 13 జిల్లాల అభివృద్ధిని జగన్ రెడ్డి చంపేశారని తీవ్రంగా ఆరోపించారు.

భార్యకు కవలలు జన్మించినా.. మొదట ప్రధానినే కలిసేందుకు వెళ్లిన నేత.. మోడీ భావోద్వేగం..

ప్రత్యేక హోదా కోసం పోరాడతానని ఎన్నికలకు ముందు చెప్పిన వైఎస్ జగన్.. ఇప్పుడు తన కేసుల మాఫీ కోసం హోదాను, వాశాఖ ఉక్కును తాకట్టు పెట్టారని విమర్శించారు. వైసీపీ పాలనకు భయపడి దాదాపు రూ. 17లక్షల కోట్ల పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయని, దీంతో లక్షల మంది నిరుద్యోగులు రోడ్డున పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఎంకే స్టాలిన్ ‘బ్రైడ్ ఆఫ్ తమిళనాడు’.. ఫ్లెక్సీలో బ్లండర్ మిస్టేక్.. వైరల్

విశాఖలోని రుషికొండ ఐటీ సెజ్‌లో నాడు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకువచ్చిన 14 కంపెనీలను జగన్ రెడ్డి తరిమేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ సమస్యను పక్కదారి పట్టించేందుకు విశాఖను రాజధానిగా ప్రకటించారని, ప్రజలను మభ్యకు గురి చేసే కుట్రకు సీఎం జగన్ తెరలేపారని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios