మాట చెప్పి గాలికొదిలేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు కు బాగా ఇష్టం. ఎన్నికల హమీలు తెగ గుప్పిస్తాడు.ఎందుకంటే తర్వాత గాలి  కొదిలేయవచ్చని ఆయనకు తెలుసు

పంట రుణాలు పూర్తిగా మాఫీ కాక, పంటలకు మద్దతు ధరల్లేక అల్లాడుతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోనందుకు నిరసనగా ప్రతిపక్ష నాయకుడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజులపాటు ‘రైతు దీక్ష’ చేపట్టారు.

గుంటూరులోని నల్లపాడు రోడ్డులో ఉన్న మిర్చి యార్డు సమీపంలో జగన్ దీక్ష ప్రారంభమైంది. రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు, రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించాలన్న ధ్యేయంతో ఈ దీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ 2014 ఎన్నికల ముందుకు రైతులకు ఇచ్చిన మాటని చంద్రబాబునాయుడునిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

జగన్ ప్రసంగం ముఖ్యాంశాలు:

‘చంద్ర‌బాబు అధికారంలో ఉన్న‌పుడు ఒక మాట‌ అధికారంలో లేపుడు మ‌రో మాట చెబుతారు. గ‌తంలో హైద‌రాబాద్ ఎంఎల్ ఏ క్వార్ట‌ర్సులో చంద్ర‌బాబు దీక్ష చేపుడితే ఎక‌రాకు పది వేలివ్వాల‌ని డిమాండు చేశారు. హుడా క‌మిటీ సిఫార్సులు అమ‌లు చేయాల‌ని ఆనాడు కోరారు. ఇరోజు హుడా ఎవ‌రు? ఇవేమిట‌ని ఇపుడు అంటున్నారు

అపుడు ఎన్నికల భ‌యం మొద‌లై ఆ విధంగా హామీలు ఇచ్చారు.ఎన్నిక‌ల స‌మ‌యంలో నేను 3 వేల కోట్ధల ధరల స్థిరీకరణ నిధి ప్ర‌క‌టిస్తే ఆయ‌న 5 వేల కోట్లన్నారు.

స్వామినాథ‌న్ క‌మిటి సిఫార్సులు అమ‌లు చేస్తాన‌న‌న్నారు. ఖ‌ర్చుపై 50 శాతం క‌లిపి ధ‌ర నిర్ణ‌యం ఇస్తామ‌న్నారు.

రైతు రుణ మాఫీ చేస్తాన‌ని హామీ ఇచ్చాడు. ఇపుడు ఈ పథకం ప్రయోజనం చేకూరక రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారు.

క్వింటాల్ మిర్చి రేటు రూ 2500-4000 కు త‌గ్గింది. రోడ్డుపై మిర్చి ని వేసుకుని రైతు కొనుగోలుకు ఎదురు చూస్తున్నారు.వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌కు గిట్టుబాటు ధర‌లు అంద‌డం లేదు.

ఎన్నికల హామీలు గాలికొదిలేయడం ఒక పక్క, పంటల ధరలు లేక మరొక పక్క రైతు సంక్షోభంలో ఉన్నాడు. అదుకునేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా లేరు. రైతులను చంద్రబాబు మోసం చేశాడు.

ఈ మోసానినికి నిర‌స‌న తెలుపుతూ నిరాహార దీక్ష చేప‌డుతున్నా.’