ప్రజాస్వామిక యుద్ధానికి అందరూ సిద్దం కావాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నవంబర్ 2వ తేదీ నుండి మొదలుకానున్న పాదయాత్ర పై చర్చించేందుకు జగన్ పార్టీ నేతలతో బుధవారం సమావేశమయ్యారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ, పాదయాత్ర విజయవంతం కావటానికి అందరూ సహకరించాలన్నారు.
ప్రజాస్వామిక యుద్ధానికి అందరూ సిద్దం కావాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నవంబర్ 2వ తేదీ నుండి మొదలుకానున్న పాదయాత్ర పై చర్చించేందుకు జగన్ పార్టీ నేతలతో బుధవారం సమావేశమయ్యారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ, పాదయాత్ర విజయవంతం కావటానికి అందరూ సహకరించాలన్నారు. పార్టీ కార్యక్రమాలను అమలు చేయటానికి నేతలు, శ్రేణులందరూ సిన్సియర్ గా పనిచేయాలన్నారు. కార్యక్రమాల అమలులో ఏమాత్రం ఏమరుపాటు తగదని హెచ్చరించారు.
సమన్వయకర్తలు పూర్తి శక్తియుక్తులను కూడదీసుకుని చంద్రబాబు పార్టీ పునాదులు కదిలిపోయేలా ఎన్నికలకు సిద్దం కావాలని చెప్పారు. వచ్చే ఎన్నికల వరకూ ప్రతీ క్షణం ఎంతో విలువైనదని, రాబోయే ప్రజాస్వామిక యుద్ధానికి ప్రతి ఒక్కరూ పూర్తి సన్నద్దమై ఒక్కటిగా ముందుకు నడవాలని జగన్ స్పష్టం చేసారు. పాదయాత్రలో అనుసరించాల్సిన ప్రణాళికపై పార్టీ నేతలు సూచనలు చేసారు.
నేతలు చెప్పిన అనేక సూచనలు, సలహాలను జగన్ నోట్ చేసుకున్నారట. వచ్చే అక్టోబర్ లోనే ఎన్నికలు తప్పకపోతే మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ పార్టీ పోరాటానికి సిద్ధంగా ఉండాలని జగన్ చెప్పారు. తాను ఒక జిల్లాలో పాదయాత్ర చేస్తున్నపుడు మిగిలిన 12 జిల్లాల్లోనూ ఆయా జిల్లాల్లోని నేతలందరూ సమిష్టిగా పాదయాత్రలు చేయాలని జగన్ ఆదేశించారు.
