చంద్రబాబు సిఎం హోదాలో మొదటిసారి కర్నూలు అభివృద్దికి ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలయ్యాయో చెప్పాలని నిలదీసారు. చంద్రబాబు అబద్దాపు హామీలతోనే మూడున్నరేళ్ళు గడిపేసారంటూ ధ్వజమెత్తారు. జిల్లా అభివృద్ధికి చంద్రబాబు హామీలిచ్చి మూడున్నరేళ్ళయినా ఇంతవరకూ ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. ఇపుడు కూడా ఉపఎన్నిక వచ్చింది కాబట్టే చంద్రబాబు, మంత్రులు నంద్యాల మొహం చూస్తున్నారని లేకపోతే ఇపుడు కూడా వచ్చేవారు కాదన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు.
కర్నూలు జిల్లా అభివృద్ధికి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరం ఇచ్చిన హామీల్లో ఎన్నింటిని నెరవేర్చారో నిలదీయాల్సిందిగా వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పిలుపినిచ్చారు. బుధవారం నంద్యాలలో రెండు వారాల ప్రచారాన్ని ప్రారంభించారు. నంద్యాల రైతు నగర్లో మధ్యహ్నం ప్రారంభమైన రోడ్డు షోలో మాట్లాడుతూ, చంద్రబాబు సిఎం హోదాలో మొదటిసారి కర్నూలు అభివృద్దికి ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలయ్యాయో చెప్పాలని నిలదీసారు.
చంద్రబాబు అబద్దాపు హామీలతోనే మూడున్నరేళ్ళు గడిపేసారంటూ ధ్వజమెత్తారు. జిల్లా అభివృద్ధికి చంద్రబాబు హామీలిచ్చి మూడున్నరేళ్ళయినా ఇంతవరకూ ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. ఇపుడు కూడా ఉపఎన్నిక వచ్చింది కాబట్టే చంద్రబాబు, మంత్రులు నంద్యాల మొహం చూస్తున్నారని లేకపోతే ఇపుడు కూడా వచ్చేవారు కాదన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. భూమా నాగిరెడ్డి మృతితో అనివార్యమైన ఉపఎన్నికలో మళ్ళీ తప్పుడు హామీలు ఇవ్వటానికి చంద్రబాబు వస్తున్నట్లు ఎద్దేవా చేసారు.
తనకు అబద్దాలు చెప్పటం రాదన్నారు. తాను కూడా చంద్రబాబు లాగే పోయిన ఎన్నికల్లో రుణమాఫీ లాంటి అబద్దాలు చెప్పివుంటే చంద్రబాబు కూర్చున్న సీట్లో తానే కూర్చుని వుండేవాడని అని అన్నారు. ప్రస్తుత ఉపఎన్నికను జగన్ నీతి-అవినితికి పోరాటంగాను, ధర్మానికి-అధర్మానికి యుద్దంగా అబివర్ణిచాంరు. అందుకే ఓటర్లందరూ ధర్మానికి ఓటు వేసి న్యాయంవైపే నిలబడాలని అర్ధించారు. తమ అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేసారు.
పోయిన ప్లీనరీ సమావేశాల్లో తాను నవరత్నాల పేరుతో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తానని చెప్పారు. చంద్రబాబు లాగ మోసపు మాటలు, తప్పడు వగ్దానాలు చేసే వాడిని కానన్నారు. మాట ఇస్తే నెరవేరుస్తానని కూడా స్పష్టం చేసారు. వైసీపీ అధికారంలోకి రాగానే 25 పార్లమెంట్ స్ధానాలను 25 జిల్లాలుగా మారుస్తానని ప్రకటించారు. అపుడు నంద్యాల పార్లమెంటు జిల్లాకు నంద్యాలే కేంద్రంగా ఉంటుందని కూడా తెలిపారు.
