జగన్ ఎన్నికల పరిది నుండి బహిష్కరించాలి. సీఈసీ ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యడమంటే అత్యయత్నమే అని ఆరోపణ.
వైసీపి అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఎన్నికల పరిది నుండి తప్పించాలని డిమాండ్ చేశారు టీడీపీ నేతలు. జగన్ పై కేసు నమోదు చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. సీఈసీ ఆదేశాలకు అనుగుణంగా జగన్‌పై రాష్ట్ర ఎన్నికల అధికారులు వెంటనే కేసు నమోదు చేయాలని మంత్రి యనమల రామకృష్ణుడు కోరారు.
ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని చెప్పడమంటే హత్యాయత్నం కిందకే వస్తుందన్నారు యనమల. జగన్ క్రూరత్వాన్ని సీఈసీ కూడా అర్థం చేసుకున్న విషయాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. జగన్ వంటి మనస్థత్వం ఉన్న నాయకులను ఎన్నికల పరిధి నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కళా వెంకట్రావు అన్నారు. ప్రజాస్వామ్యంలో అరాచకానికి తావు ఉండకూడదన్నారు. ముఖ్యమంత్రినే కాలుస్తామన్న పదజాలం ఇప్పటివరకు ఎవరూ వాడలేదని పేర్కొన్నారు. జగన్ లాంటి నాయకులను రాష్ట్రం నుంచి సాగనంపాలని..ఆయన ప్రజలకు సూచించారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో వైసీపిని ఓడించి ఆ శ్రేణులకు తగిన బుద్ది చెప్పాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
