ఎప్పుడైతే శిల్పా వైసీపీలో చేరారో అప్పుడు ఉపఎన్నికలో పోటీ చేయబోయే అభ్యర్ధి శిల్పానే అని అందరికీ అర్ధమైపోయింది. అయితే, అభ్యర్ధి విషయాన్ని జగన్ నంద్యాల, కర్నూలులోని సీనియర్లతో మాట్లాడిన తర్వాతే ప్రకటించారు. దాంతో  ఇక నంద్యాల్లో ఎన్నికల యుద్ధం మొదలైనట్లే.

అందరూ అనుకుంటున్నట్లే నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డినే నియమించింది. నియోజకవర్గం సమన్వయకర్తగా కూడా నియమించారు. శిల్పా అభ్యర్ధిత్వం ప్రకటనతో నంద్యాల యుద్దం మొదలైనట్లే. టిడిపి తరపున ఇప్పటికే భూమాబ్రహ్మానందరెడ్డిని చంద్రబాబు ప్రకటించారు. అభ్యర్ధి ప్రచారం కూడా మొదలుపెట్టేసారు. ఆదివారం ప్రధాన ప్రతిపక్షం తరపున తాజాగా శిల్సా ప్రకటనతో రాష్ట్ర రాజకీయాల్లో నంద్యాల వేడి మొదలైనట్లే.

నంద్యాల ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజగోపాలరెడ్డి తదితరులు ప్రయత్నాలు చేసుకున్నారు. అయితే, అధికార పార్టీ అభ్యర్ధిని తట్టుకుని నిలబడాలంటే వైసీపీ అభ్యర్ధికి ముందు తగిన ఆర్ధిక బలం ఉండాలి. అందుకే అభ్యర్ధిని ఖరారు చేయటానికి జగన్ ఇన్ని రోజులు తీసుకున్నారు. ఒకవిధంగా వైసీపీలో అంతటి గట్టి అభ్యర్ధి లేనట్లే. అందుకే టిడిపిలో ఉన్న శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలోకి వస్తానంటే జగన్ కూడా ఆహ్వానించారు. ఎప్పుడైతే శిల్పా వైసీపీలో చేరారో అప్పుడు ఉపఎన్నికలో పోటీ చేయబోయే అభ్యర్ధి శిల్పానే అని అందరికీ అర్ధమైపోయింది. అయితే, అభ్యర్ధి విషయాన్ని జగన్ నంద్యాల, కర్నూలులోని సీనియర్లతో మాట్లాడిన తర్వాతే ప్రకటించారు. దాంతో ఇక నంద్యాల్లో ఎన్నికల యుద్ధం మొదలైనట్లే.