Asianet News TeluguAsianet News Telugu

‘సీమ’ ఉద్యమాల్లో చురుకైన పాత్ర

  • ఈనెల 13వ తేదీన ‘రాయలసీమ అభివృద్ధి- సవాళ్ళు’ అనే అంశంపై కర్నూలులో జరుగనున్న ఓ సదస్సులో  పాల్గొంటున్నారు.
  • అదే విధంగా రాయలసీమ సమస్యలపై అనేక సంస్ధలు ఎప్పటినుండో చురుగ్గా పనిచేస్తున్నాయ్.
  • అటువంటి సంస్ధలతో కూడా కలిసి ఐవైఆర్ పనిచేయాలని నిర్ణయించుకున్నారు.
  • రాయలసీమ జలాలు, రాయలసిమ ఉద్యోగాలు, ఉపాధి, రాయలసీమ వెనుకబాటు, రాయలసీమలో పరిశ్రమల ఏర్పాటు అంటూ అనేక అంశాలు ఎప్పటి నుండో జనాల్లో నానుతున్నాయ్.
Iyr  says he will take active part in rayalaseema problems salvation

ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు రాయలసీమ ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించనున్నారా? అవుననే సమాధానం వస్తోంది. ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన తర్వాత బ్రాహ్మణ కార్పొరేషన్ వ్యవస్ధాపక ఛైర్మన్ గా పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే, వివిధ కారణాల వల్ల కార్పొరేషన్ నుండి ఆయనను చంద్రబాబునాయుడు ఏ విధంగా బయటకు పంపారో కూడా అందరూ చూసిందే. అదే ఐవైఆర్ భవిష్యత్తులో రాయలసీమ ఉద్యమాల్లో చురుకైన పాత్రను పోషించాలని అనుకుంటున్నారు.

ఇందులో భాగంగానే ఈనెల 13వ తేదీన ‘రాయలసీమ అభివృద్ధి- సవాళ్ళు’ అనే అంశంపై కర్నూలులో జరుగనున్న ఓ సదస్సులో  పాల్గొంటున్నారు. అదే విధంగా రాయలసీమ సమస్యలపై అనేక సంస్ధలు ఎప్పటినుండో చురుగ్గా పనిచేస్తున్నాయ్. అటువంటి సంస్ధలతో కూడా కలిసి ఐవైఆర్ పనిచేయాలని నిర్ణయించుకున్నారు. రాయలసీమ జలాలు, రాయలసిమ ఉద్యోగాలు, ఉపాధి, రాయలసీమ వెనుకబాటు, రాయలసీమలో పరిశ్రమల ఏర్పాటు అంటూ అనేక అంశాలు ఎప్పటి నుండో జనాల్లో నానుతున్నాయ్. గడచిన మూడేళ్ళుగా ఈ అంశాలు ప్రధానంగా ఫోకస్ అవుతున్నాయి.

కాబట్టి, ఇటువంటి అనేక అంశాలపై జరిగే సదస్సులు లేదా కార్యక్రమాల్లో పాల్గొనే యోచనలో ఉన్నారు. ఇదే విషయమై ఐవైఆర్ ‘ఏషియానెట్’ తో మట్లాడుతూ, రాయలసీమ సమస్యల పరిష్కారంలో తాను కూడా చురుకైన పాత్ర పోషించాలని అనుకుంటున్నట్లు స్పష్టం చేసారు. అయితే, తనను ఇంత వరకూ ఏ వేదిక కూడా ప్రత్యేకంగా పిలవలేదని కూడా తెలిపారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న సంస్ధల్లో ఎవరైనా తనను పిలిస్తే వారి క్రెడిన్షియల్స్ చూసి అప్పుడు వారితో కలుస్తానని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios