Asianet News TeluguAsianet News Telugu

విశాఖలో పాఠశాల కూల్చివేత: వాళ్లంతా పేద విద్యార్ధులే, చంద్రబాబు ఆవేదన.. సీఎస్‌కు లేఖ

విశాఖలో హిడెన్‌ స్ప్రౌట్స్‌ పాఠశాల కూల్చివేతపై టీడీపీ చీఫ్, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం కూల్చివేత చర్యల్లో చోటు చేసుకున్న తాజా ఘటన అత్యంత హేయమని ఆయన మండిపడ్డారు.

its disgusting to demolish Hidden Sprouts School in Visakhapatnam says tdp chief Chandrababu ksp
Author
Visakhapatnam, First Published Jun 9, 2021, 8:59 PM IST

విశాఖలో హిడెన్‌ స్ప్రౌట్స్‌ పాఠశాల కూల్చివేతపై టీడీపీ చీఫ్, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం కూల్చివేత చర్యల్లో చోటు చేసుకున్న తాజా ఘటన అత్యంత హేయమని ఆయన మండిపడ్డారు. ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు. ఈ మేరకు ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు ఆయన లేఖ రాశారు.  

హిడెన్‌ స్ప్రౌట్స్‌ పాఠశాల విద్యార్థులకు న్యాయం చేయాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. 2013లో జీవీఎంసీ నుంచి లీజుకు తీసుకుని 190 మంది విద్యార్థులతో నడుస్తున్న ఈ పాఠశాలలో ఎక్కువ మంది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చిన వారేనని ఆయన గుర్తు చేశారు. ఎలాంటి ముందుస్తు నోటీసు లేకుండా ఈనెల 5న పాఠశాల ప్రాంగణాన్ని కూల్చివేసిన అధికారులు 6న స్వాధీనం చేసుకోవటాన్ని ప్రతిపక్షనేత తప్పుబట్టారు.

Also Read:నా ఆవేదన మాటల్లో వ్యక్తం చేయలేను...: సీఎస్ కు రాసిన లేఖలో చంద్రబాబు

ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి చర్యల ద్వారా కలిగే ఆవేదనను మాటల్లో వ్యక్త పరచలేమని చంద్రబాబు అన్నారు. చట్టం, న్యాయం నిబంధనల్ని పూర్తిగా విస్మరించిన వైసీపీ ప్రభుత్వం అధికారంలో కొనసాగే  నైతిక హక్కును కోల్పోయిందని దుయ్యబట్టారు. నిజమైన సేవా స్ఫూర్తితో సమాజానికి నిస్వార్థ సేవ చేస్తున్న సంస్థలకు గట్టి మద్దతు ఇవ్వాలని చంద్రబాబు ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.  

Follow Us:
Download App:
  • android
  • ios