Asianet News TeluguAsianet News Telugu

నా ఆవేదన మాటల్లో వ్యక్తం చేయలేను...: సీఎస్ కు రాసిన లేఖలో చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వ కూల్చివేత చర్యలలో తాజాగా విశాఖపట్నంలో చోటుచేసుకున్న కూల్చివేత చర్య అత్యంత హేయకరమైందిగా టిడిపి చీఫ్ చంద్రబాబు పేర్కొన్నారు.

chandrababu writes a letter to chief secretary on  hidden sprouts school demolished  akp
Author
Visakhapatnam, First Published Jun 9, 2021, 10:58 AM IST

విశాఖపట్నం: లాభాపేక్షలేకుండా మానసిక దివ్యాంగుల పాఠశాల హిడెన్ స్ప్రౌట్స్‌ ను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకోవడం విచారకరమని టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్నంలోని హిడెన్ స్ప్రౌట్స్‌ పాఠశాల కూల్చివేతపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చంద్రబాబు లేఖ రాశారు. 

''వైసీపీ ప్రభుత్వ కూల్చివేత చర్యలలో తాజాగా విశాఖపట్నంలో చోటుచేసుకున్న కూల్చివేత చర్య అత్యంత హేయకరమైనది. గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జివిఎంసి) 2013 లో ఈ పాఠశాలను రెండు గదులతో లీజుకు తీసుకుంది. ప్రస్తుతం ఇది సుమారు 190 మంది విద్యార్థులతో నడుస్తోంది. పాఠశాలలో చదువుతున్న పిల్లలలో చాలా మంది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుండి వచ్చిన వారే'' అని తెలిపారు. 

''ప్రభుత్వ అధికారులు 05 జూన్ 2021 శనివారం నాడు తాత్కాలిక షెడ్లను కూల్చివేసిన అధికారులు పాఠశాల ప్రాంగణాన్ని 6 జూన్ 2021 ఆదివారం నాడు స్వాధీనం చేసుకున్నారు. పాఠశాలకు ఎటువంటి వ్రాతపూర్వక నోటీసు ఇవ్వకుండా సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా కూల్చివేత జరిగింది'' అని ఆరోపించారు. 

read more  మానసిక వికలాంగుల స్పోర్ట్ స్కూల్ కూల్చివేత

''నాగరిక సమాజంలో ఇటువంటి దారుణమైన చర్యకు అనుమతించడం సిగ్గుచేటు. మనలాంటి ప్రజాస్వామ్య మరియు రాజ్యాంగబద్ధంగా పాలన సాగించే దేశంలో ఇటువంటి చర్యల వల్ల కలిగే ఆవేదన మాటల్లో వ్యక్తపరచలేము. చట్టం, న్యాయం అనే నాగరిక నిబంధనలను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది'' అన్నారు. 

''2021 జూన్5 న మానసిన వికాలాంగుల పిల్లల పాఠశాలను కూల్చివేయడంతో వైసీపీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉండటానికి నైతిక హక్కును కోల్పోయింది. ఈ నేపథ్యంలో, సమాజానికి నిజమైన సేవా స్ఫూర్తితో పని చేస్తున్న లాభాపేక్షలేని సంస్థలకు గట్టి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను'' అని  పేర్కొన్నారు. 

''అత్యవసర ప్రాతిపదికన వివిధ మేధో మరియు శారీరక సామర్థ్యత కలిగిన పిల్లల పాఠశాల అయిన హిడెన్ స్ప్రౌట్స్‌ లో చదువుతున్న పిల్లలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ల్యాండ్ మాఫియా, భూ కబ్జాదారుల సహకారంతో ఇటువంటి భయంకరమైన చర్యలకు కారణమైన అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది'' అని సీఎస్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios