వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందా? తాజాగా నారా లోకేష్ మాటలు విన్న వారికి అదే అనుమానాలు వస్తున్నాయి. దానికితోడు వచ్చే ఎన్నికల్లో భాజపా అవసరం తమకు అవసరం లేదని నేతలు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. దాంతో వచ్చే ఎన్నికల విషయంలో టిడిపి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి.
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందా? తాజాగా నారా లోకేష్ మాటలు విన్న వారికి అదే అనుమానాలు వస్తున్నాయి. దానికితోడు వచ్చే ఎన్నికల్లో భాజపా అవసరం తమకు అవసరం లేదని నేతలు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. దాంతో వచ్చే ఎన్నికల విషయంలో టిడిపి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఎలాగూ భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ నేతలు ఎప్పటి నుండో చెబుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, నంద్యాల, కాకినాడ ఎన్నికల తర్వాత ఎక్కడా చప్పుడు చేయటం లేదనుకోండి అది వేరే సంగతి.
ఇక, ప్రస్తుత విషయానికి వస్తే వచ్చే ఎన్నికల్లో టిడిపి 175 సీట్లలోను గెలుస్తుందని లేకేష్ శుక్రవారం ప్రకటించారు. మరి, టిడిపినే 175 సీట్లలో గెలిస్తే ఇక, భాజపా, జనసేన పార్టీల మాటేమిటి? ఎందుకంటే, రాష్ట్రంలో ఉన్నవే 175 సీట్లు. పోటీ చేసిన అన్నీ సీట్లలోనూ ఏ పార్టీ కుడా గెలివలేందుకదా? అదే సమయంలో బాజపా, జనసేన తమ మిత్రపక్షాలేనంటూ ఇంకోవైపు చెబుతున్నారు లోకేష్. ఒకే సమయంలో రెండు ప్రకటనలు చేయటంలో లోకేష్ ఆంతర్యమేమిటో అర్ధం కావటం లేదు. టిడిపినే అన్నీ సీట్లు గెలిస్తే, మరి మిత్రపక్షాల మాటేమిటి అన్న ప్రశ్నకు లోకేష్ నవ్వేసి అక్కడి నుండి వెళ్లిపోయారు. అంటే ఆ నవ్వుకు అర్ధమేంటి?
ఇక్కడే లోకేష్ ప్రకటన పట్ల పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భాజపా పరిస్ధితి ఎలాగున్నా దాని మద్దతు లేకుండానే వచ్చే ఎన్నికల్లో గెలవగలమని నంద్యాల, టిడిపి ఎన్నికలు నిరూపించాయని టిడిపి నేతల్లో చర్చ మొదలైంది. అదే సమయంలో జనసేన మద్దతు లేకపోయినా వచ్చే నష్టం ఏంటని నేతల మధ్య చర్చ జరుగుతోంది. పార్టీలోని పరిణామాలు చూస్తుంటే, బహుశా టిడిపి వచ్చే ఎన్నికల్లో ఒంటిరి పోటీకి ఆలోచిస్తోందా అన్న అనుమానాలు మొదలయ్యాయి.
