వైసిపి ఎంఎల్ఏ రోజాకు టిడిపిలో చేరమని ఆహ్వనం (ఒత్తిడి) వస్తోందా ? అవుననే చెబుతున్నారు రోజా. గురువారం మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో   మాట్లాడుతూ, టిడిపిలో చేరాల్సిందిగా తనకు మళ్ళీ ఆహ్వానం వస్తున్నట్లు స్వయంగా తెలిపారు. రోజానే చెబుతున్నారు కాబట్టి నమ్మాల్సిందే. అయితే, తనకు ఎవరి వద్ద నుండి ఆహ్వానం వచ్చింది? మధ్యవర్తిత్వం చేస్తోంది ఎవరు అన్న విషయాలను సందర్భం వచ్చినపుడు వివరాలు బయటపెడతానని చెప్పారు. తాను టిడిపిలో ఉన్నపుడు నగిరి అని చంద్రగిరి అని ఒక నియోజకవర్గమని కాకుండా తన ఇష్టం వచ్చినట్లు తిప్పి చంద్రబాబునాయుడు తనను ఇబ్బంది పెట్టినట్లు మండిపడ్డారు. వేధింపులు తట్టుకోలేకే తాను టిడిపిని వదిలేసినట్లు చెప్పారు. 

 

అదే సందర్భంలో అప్పట్లో టిడిపిలో ఉన్న మాధవరెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి, దేవేందర్ గౌడ్ లను కూడా చంద్రబాబు తొక్కేసారంటూ ఆరోపించారు. పార్టీలో తనకన్నా ఎవరైనా ఎక్కువ పేరు సంపాదించుకుంటున్నారని చంద్రబాబుకు అనుమానం రాగానే వాళ్ళని తొక్కేయటం చంద్రబాబుకు అలవాటే అంటూ ఎద్దేవా చేసారు.