Asianet News TeluguAsianet News Telugu

రూ. 9800 కోట్ల షెల్ కంపెనీలా?

ఎంసిబి ఫిర్యాదు ప్రకారం సుజనా ఇండస్ట్రీస్ సుమారు రూ. 9800 కోట్ల మేర షెల్ కంపెనీలున్నాయట. కోర్టు ఆదేశాలను బ్యాంకులకు తెలియజేసినా ఖాతరు చేయకుండా సుజనాకు బ్యాంకులు సహకరించాయని ఎంసిబి తన ఫిర్యాదులో పేర్కొనటం గమనార్హం.

Is sujana running Rs 9800cr shell companies

కేంద్రమంత్రి సుజనా చౌదరిపై కేసు నమోదు చేయాలంటూ మారిషస్ కమర్షియల్ బ్యాంక్ (ఎంసిబి) సిఐడి డిఐజికి ఫిర్యాదు చేసింది. కేంద్రమంత్రితో పాటు కొన్ని బ్యాంకులు కుమ్మకై తమను మోసం చేసాయని ఎంసిబి తన ఫిర్యాదులో పేర్కొంది. ఇంతకీ మారిషస్ బ్యాంకు ఎందుకు ఫిర్యాదు చేసింది? గతంలో ఏవో అవసరాల కోసం సుజనా ఇండస్ట్రీస్ ఎంసిబి నుండి రూ. 106 కోట్ల రుణం తీసుకున్నది. తర్వాత చెల్లించలేదు. దాంతో సుజనాపై ఎంసిబి కేసు వేసింది. ఆ కేసులోనే కేంద్రమంత్రికి నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది లేండి.

అయితే, ఏదో తంటాలు పడి బెయిల్ తెచ్చుకున్నారు కేంద్రమంత్రి. తర్వాత కూడా రుణాన్ని చెల్లించలేదట. దాంతో సుజనా ఇండస్ట్రీస్ లావాదేవీలు నడిపే బ్యాంకుల ఖాతాలను స్ధబింపచేయాలని, బ్యాంకు లావాదేవీల వివరాలను తమకు అందచేయాలని ఎంసిబి అన్నీ బ్యాంకులకు లేఖలు రాసింది. లావాదేవీలు జరపకుండడా ఖాతాలను స్తంభింపచేస్తే సుజా దారికొస్తారని ఎంసిబి అనుకున్నట్లుంది. అయితే ఏ బ్యాంకూ ఎంసిబికి సహకరించలేదు.

అదే కారణాన్ని చూపి తాజాగా ఎంసిబి సుజనాపైనే కాకుండా ఖాతాలున్న బ్యాంకులపైన కూడా సిఐడి డిఐజికి ఫిర్యాదు చేసింది. ఎంసిబి ఫిర్యాదు ప్రకారం సుజనా ఇండస్ట్రీస్ సుమారు రూ. 9800 కోట్ల మేర షెల్ కంపెనీలున్నాయట. కోర్టు ఆదేశాలను బ్యాంకులకు తెలియజేసినా ఖాతరు చేయకుండా సుజనాకు బ్యాంకులు సహకరించాయని ఎంసిబి తన ఫిర్యాదులో పేర్కొనటం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే బ్యాంకులే ఎంసిబిని పట్టించుకోకపోతే రాష్ట్రప్రభుత్వ ఆధీనంలో ఉండే సిఐడి ఏం చేస్తుంది? చూడాలి మరి.

Follow Us:
Download App:
  • android
  • ios