పలువురు కాపు నేతలను పోలీసులు పిలిపించి ఉద్యమానికి దూరంగా ఉండాలని కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ ముద్రగడ పాదయాత్ర జరిగేందుకు వీల్లేదని చంద్రబాబు గట్టిగా నిర్ణయించారు. ఆయన పాదయాత్రతో తన ప్రభుత్వానికి ఏదో కీడు జరుగుతుందని చంద్రబాబు భయపడుతున్నట్లు కనబడుతోంది. అందుకనే ప్రతీసారీ ముద్రగడ ఆందోళనను అడ్డుకుంటున్నారు.
మద్రగడ ఉద్యమం అంటే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు? పోయిన ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీనేకదా ముద్రగడ తదితరులు అమలు చేయమని డిమాండ్ చేస్తున్నది? వారి డిమాండ్ ను పట్టించుకోకపోవటంతోనే కదా ముద్రగడ ఆందోళనబాట పట్టింది? వారు ఆందోళన చేస్తుంటే సిఎం ఎందుకు ఉలికిపడుతున్నారు. ఈనెల 26వ తేదీన ముద్రగడ మొదలుపెట్టాలనుకుంటున్న పాదయాత్ర విషయంలో ప్రభుత్వంలో ఆందోళన స్పష్టంగా కనబడుతోంది. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల్లో ముద్రగడ అనుచరులుగా, ఉద్యమంలో యాక్టివ్ గా ఉన్నారనుకున్న పలువురు కాపు నేతలను టార్గెట్ చేసింది ప్రభుత్వం.
పలువురు కాపు నేతలను పోలీసులు పిలిపించి ఉద్యమానికి దూరంగా ఉండాలని కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ ముద్రగడ పాదయాత్ర జరిగేందుకు వీల్లేదని చంద్రబాబు గట్టిగా నిర్ణయించారు. ఆయన పాదయాత్రతో తన ప్రభుత్వానికి ఏదో కీడు జరుగుతుందని చంద్రబాబు భయపడుతున్నట్లు కనబడుతోంది. అందుకనే ప్రతీసారీ ముద్రగడ ఆందోళనను అడ్డుకుంటున్నారు. ఉభయగోదావరి జిల్లాలో ఎక్కడ పదిమంది బైకుల్లో తిరిగినా వారందిరినీ ఉద్యమకారులుగానే భావిస్తున్న ప్రభుత్వం వెంటనే కేసులు పెట్టేస్తోంది.
గతంలో తునిలో జరిగిన రైలు దహనం ఘటన, తదనంతర అరెస్టులు, పోలీసు విచారణ తదితరాలను పోలీసులు ఉద్యమకారులకు గుర్తు చేస్తున్నారు. ప్రధానంగా యువతను పోలీసు స్టేషన్లకు పిలిపించుకుని కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కాపు నేతల కదలికలపై నిరంతరం నిఘా వేసింది పోలీసు శాఖ. వ్యాపారస్తులతో పాటు పలువర్గాలకు చెందిన వారిని పోలీసు స్టేషన్లకు పిలిపించి పోలీసు అధికారులు మాట్లాడుతున్నారు.
ప్రభుత్వం ఎంత చెప్పినా మాట వినరు అనుకున్న వారి విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందస్తు అరెస్టులకు కూడా పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. పోలీసులకు తోడు టిడిపి నేతలు కూడా రంగంలోకి దిగారు. ఉద్యమంలో పాల్గొంటారని అనుకున్న వారిని ఏదో ఒకవిధంగా ఉద్యమానికి దూరంగా ఉంచేందుకు నేతలు తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు. కిర్లంపూడి మొత్తం పోలీసులు దిగిపోయారు. ముద్రగడ నివాసం చుట్టూ పోలీసులే. ప్రభుత్వం అణచివేత ఎక్కువ చేసే కొద్దీ ఉద్యమకారులు మరింత రెచ్చిపోయే అవకాశం ఉందన్న విషయం చంద్రబాబు మరచిపోతున్నట్లున్నారు.
