నంద్యాలలో గెలుపు విషయమై చంద్రబాబు నిర్వహిస్తున్న సమావేశానికి చక్రపాణిరెడ్డి హాజరవ్వటాన్ని పలువురు నేతలు ఇష్టపడలేదట. అంటే, చక్రపాణిరెడ్డిని టిడిపినేతలు మోహన్ రెడ్డి కోవర్టుగా అనుమానిస్తున్నట్లు కనబడుతోంది. అందుకనే, చంద్రబాబు పర్యటన మొత్తానికే దూరంగా ఉంచటంలో భాగంగానే అసలు సమాచారమే ఇవ్వలేదని ప్రచారం జరుగుతోంది.

తెలుగుదేశంపార్టీ నాయకత్వం శిల్పా చక్రపాణిరెడ్డిని దూరంగా పెడుతోందా? జిల్లాలో జరుగుతున్నపరిణామాలు అవుననే చెబుతున్నాయి. ఈరోజు చంద్రబాబునాయుడు కర్నూలు జిల్లా పర్యటనకు వస్తున్నారు. సాయంత్రం నంద్యాలలో జరిగే ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. మామూలుగా అయితే, చంద్రబాబు జిల్లా పర్యటన ఏమంతా చెప్పుకోతగ్గది కాదు. కానీ తర్వలో నంద్యాలలో జరుగనున్న ఉపఎన్నిక కారణంగా చాలా ప్రధానత్య వచ్చింది.

తన పర్యటనలో నంద్యాల ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలను, పార్టీ, అభ్యర్ధి బలాబలాలపై జిల్లా నేతలతో సమీక్ష కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఉన్న టిడిపి నేతలందరూ కర్నూలు, నంద్యాలకు చేరుకుంటున్నారు. అటువంటి నేపధ్యంలో ఎంఎల్సీ శిల్పాచక్రపాణిరెడ్డికి చంద్రబాబు పర్యటనకు సంబంధించిన సమాచారం లేదట. ఎందుకు లేదంటే, మొన్నే టిడిపికి రాజీనామా చేసి వైసీపీలో చేరిన శిల్పా మోహన్ రెడ్డకి స్వయానా సోదరుడవ్వటమే చక్రపాణి రెడ్డి చేసుకున్న పాపం.

మోహన్ రెడ్డి ఎప్పుడైతే వైసీపీలో చేరిపోయారో అప్పటి నుండి టిడిపి నేతలందరూ చక్రపాణిరెడ్డిని అనుమానంగా చూస్తున్నారు. ఏదో ఒకరోజు చక్రపాణిరెడ్డి కూడా వైసీపీలో చేరిపోయేవారే అన్నది టిడిపి నేతల అనుమానం. ఎందుకంటే, శిల్పా సోదరుల బలమంతా మోహన్ రెడ్డి బలమేనట. కాబట్టి మోహన్ రెడ్డి ఎక్కడుంటే చక్రపాణిరెడ్డి కూడా అక్కడే ఉంటారట. ఈ విషయాన్ని బాహాటంగానే టిడిపి నేతలు చర్చించుకుంటున్నారు.

టిడిపి నేతల వైఖరి, అనుమానపు మాటలతో చక్రపాణిరెడ్డిలో ఒక విధమైన ఇబ్బందులు మొదలయ్యాయి. నంద్యాల ఉప ఎన్నికలో గెలవటం చంద్రబాబుకు ఎంతో ప్రతిష్టాత్మకం. అదేసమయంలో వైసీపీ కూడా ఉపఎన్నికలో గెలవటాన్ని ప్రతిష్టగా తీసుకున్నది. దానికితోడు మొన్ననే వైసీపీలో చేరిన మోహన్ రెడ్డే వైసీపీ తరపున అభ్యర్ధిగా ప్రచారం జరుగుతోంది.

అటువంటి పరిస్ధితిలో నంద్యాలలో గెలుపు విషయమై చంద్రబాబు నిర్వహిస్తున్న సమావేశానికి చక్రపాణిరెడ్డి హాజరవ్వటాన్ని పలువురు నేతలు ఇష్టపడలేదట. అంటే, చక్రపాణిరెడ్డిని టిడిపినేతలు మోహన్ రెడ్డి కోవర్టుగా అనుమానిస్తున్నట్లు కనబడుతోంది. అందుకనే, చంద్రబాబు పర్యటన మొత్తానికే దూరంగా ఉంచటంలో భాగంగానే అసలు సమాచారమే ఇవ్వలేదని ప్రచారం జరుగుతోంది.