అనంతపురం జిల్లా అభివృద్ధి బెంగుళూరు సెంట్రిక్ అభివృద్ధిలో భాగం కారాదు. బెంగుళూరును చూపి అనంతపురానికి పెట్టుబడులు తెప్పించాలనుకునే అలోచన మంచిది  కాదు. దీని వల్ల అనంతపురం జిల్లా స్వరూపం దెబ్బతింటుంది. అది వేలాది మంది రైతులకు ప్రమాదం.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం, చిత్తూరు జిల్లాలలో రాంగ్ డెవెలప్ మెంట్ మోడెల్ ఫాలో అవుతున్నారా?

అవునని సీనియర్ ఐఎఎస్ అధికారి ఒకరు ఏసియానెట్ తో మాట్లాడుతూ చెప్పారు. అనంతపురం, చిత్తూరు జిల్లాలకు ఏ మోడెల్ పనికొస్తుందో ఆమోడల్ అనుసరించడం లేదని పేరు రాసేందుకు ఒప్పుకొనని ఈ సీనియర్ ఐఎఎస్ అధికారి చెప్పారు. తొందర్లో ఈ విషయాలు తాను ముఖ్యమంత్రితో షేర్ చేసుకుంటానని చెప్పారు.

ఆయన మాట్లలో చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న ఈ రెండు జిల్లాల విధానంలో పొరపాట్లున్నాయి. అవేవో చూద్దాం.

అనంతపురం జిల్లాను పారిశ్రామికీకరణ చేయాలన్న ప్రతిపాదన చెవులకు ఇంపుగా కనిపిస్తుంది. అదే విధంగా చిత్తూరు జిల్లా శ్రీసిటిని విపరీతంగా ప్రోత్సహిస్తున్నారు. ఈ రెండుజిల్లాలు బాగా వెనకబడిన ప్రాంతాలు కాబట్టి, అనంతపురం జిల్లాలో ఒక ఫ్యాక్టరీ, శ్రీసిటిలొ మరొక విదేశీ కంపెనీ మాన్యు ఫ్యాక్చరింగ్ యూనిట్ అంటే గొప్ప శుభవార్తలా చూస్తాం.

చిత్తూరు జిల్లాను ప్రమోట్ చేస్తున్నపుడు ఛెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు దగ్గరని, అనంతపురం పెనుగొండను ప్రమోట్ చేస్తున్నపుడు బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు దగ్గరని ప్రభుత్వమే చెబుతూ ఉంది. అంతేకాదు, ఒక సమాచారం ప్రకారం, తమిళనాడు నుంచి కియా మోటర్స్ ను అనంతపురం జిల్లాకు రప్పించేందుకు కియో మోటార్స్ యూనిట్ దగ్గిర నుంచి కర్నాటక దాకా 200 అడుగల రోడ్డొకటి ప్రత్యేకంగావేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అంటే, అనంతపురం ను బెంగుళూరు కేంద్రంగా జరిగే అభివృద్ధిసర్కిల్ లోకి తోస్తున్నారు. అదే విధంగా చిత్తూరు జిల్లాను చెన్నై సెంట్రిక్ అభివృద్ధిలోకి తోస్తున్నారు. అంటే, ఈ రెండు జిల్లాల్లో వచ్చే పరిశ్రమలకు వల్ల ఎక్కువ లబ్ది పొందేది చెన్నై, బెంగుళూరే నని స్పష్టం.

 ఈ రెండు జిల్లాలు మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లా వ్యవసాయాధార ఆర్ధిక వ్యవస్థ ఉన్న జిల్లా. ఇక్కడ రైతులంతా పేద, మధ్యతరగతి వారే. వాళ్లకున్న భూములన్నీ పదెకారాల లోపే ఉంటాయి. పరిశ్రమలొస్తే, ఒక ప్రాంతానికే కొంత మేలు జరగుతుంది. ఈ పరిశ్రమలొచ్చిన హంగామాలో అసలు రైతు మరుగున పడే ప్రమాదం ఉంది. అనంతపురం జిల్లా అభివృద్ధి బెంగుళూరు సెంట్రిక్ అభివృద్ధిలో భాగం కారాదు. బెంగుళూరును చూపి అనంతపురానికి పెట్టుబడులు తెప్పించాలనుకునే ప్రచారం మంచిది కాదు. దీని వల్ల అనంతపురం జిల్లా స్వరూపం దెబ్బతింటుంది. అది వేలాది మంది రైతులకు ప్రమాదం.

అందువల్ల అనంతపురం జిల్లా స్వరూపం చెడిపోకుండా ఉండేందుకు ముందు చర్యలు తీసుకోవాలి. అనంతపురం జిల్లాకు నీరివ్వాలి. అక్కడ వ్యవసాయం ప్రోత్సహించాలి. అనంతపురం జిల్లాను వ్యవసాయం జోన్ గా ఉంచాలి. దానిని బెంగుళూరు సెంట్రిక్ పరిశ్రామికాభివృద్ధిలో కర్నాటక అర్థిక వ్యవస్థ లో భాగం చేయరాదు. ప్రభుత్వం ఈ దిశలో ప్రయాణిస్తున్నదనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రికి సరైన సలహా అందడంలేదు. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు నీళ్లిస్తే చాలు అవి అభివృద్ధిలో విజృంభిస్తాయి. ఇలాంటి అగ్రికల్చర్ జోన్ లో తొందరగా, పెద్దగా కంటికి కనిపించే పరిశ్రమలను స్థాపించి వాటిని బెంగుళూరు, చెన్నై అర్థిక వ్యవస్థలతో ముడేయడం సబబుకాదు.

ఇక్కడొక ముఖ్యమయిన విషయం ఉంది. కర్నాటక ప్రభుత్వం, దక్షిణ భారత దేశంలోని బెంగుళూరు విమనాశ్రయాన్ని అంత్యంత కీలకమయన విమానాశ్రయంల చేసేందుకు ఒక ప్రణాళిక తయారుచేసిందని నాకుతెలిసింది. దీనికోసం బెంగుళూరు చుట్టూ 500 కి.మీ వ్యాసార్థంలో ఉన్న భూభాగం మొత్తం ఈ విమానాశ్రయంతో సంబంధం ఉండేలా చేయాలన్న పథకం. ఇందులోకి అనంతపురం కూడ వస్తుంది. అనంతపురం జిల్లాలో వచ్చే పెద్ద పరిశ్రమలన్నీ సమీపాన ఉన్న బెంగుళూరు విమానాశ్రయాన్ని వాడుకోవలసి వస్తుంది. అపుడు కర్నాటకకే ఎక్కువ ప్రయోజనం.

కొంతమంది ఈ మోడల్ ను పనిగట్టుకుని బెంగుళూరు సెంట్రిక్, చెన్నైసెంట్రిక్ అభివృద్ధిలోకి అనంతపురం, చిత్తూరు జిల్లాలను తోసే ప్రయత్నం జరుగుతూ ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నపుడు కూడా ఈ మోడెల్ చూపి అనంతపురంలో సైన్స్ సిటి అని ప్రారంభించారు. అది కదల్లేదు. ఇపుడు మరొక ప్రయత్నం జరుగుతూ ఉంది.