కేంద్ర బడ్జెట్ తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఊహించనదానికన్నా చాలా వేగంగా మారిపోతున్నాయి. కేంద్రబడ్జెట్లో ఏపి ప్రయోజనాల గురించి కానీ విభజన చట్టం హామీల గురించి కానీ కనీస ప్రస్తావన కూడా లేదు. దాంతో రాష్ట్రప్రజానీకం మండిపోతుంది. కాబట్టే భాజపా మినహా టిడిపితో కలుపుకుని ప్రతిపక్షాలన్నీ మండిపోతున్నాయ్. దాంతో భాజపాతో పొత్తుల విషయంలో చంద్రబాబునాయుడు ఆదివారం ఎంపిలు, మంత్రులు, నేతలతో అత్యవసర సమావేశం పెట్టుకున్నారు.

ఇటువంటి సమయంలోనే ఓ సంచలన విషయం వెలుగు చూసింది. దాంతో మచంద్రబాబుపై పెద్ద బాంబు పడినట్లైంది.  ఇంతకీ అదేమిటంటే శనివారం చంద్రబాబు మహారాష్ట్రలోని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే తో ఫోన్లో మాట్లాడారట. మోడికి వ్యతిరేకంగా చర్చలు జరిపారట. బడ్జెట్ నేపధ్యంలో భాజపాపై టిడిపిలో పెరుగుతున్న వ్యతిరేకతను వివరించారట. పనిలో పనిగా మూడో ఫ్రంట్ విషయాన్ని కూడా ప్రస్తావించారట. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కూడా చంద్రబాబు మాట్లాడినట్లు సమాచారం.

భాజపాతో పొత్తు వద్దనుకుని బయటకు వచ్చేస్తే మోడి వ్యతరేక శక్తులు తనకు మద్దతుగా నిలబడే అవకాశాలపై చంద్రబాబు థాక్రేతో చర్చించినట్లు ఓ ఆంగ్ల పత్రిక వెల్లడించింది. వ్యవహారం చూస్తుంటే భాజపాతో పొత్తు కట్ చేసుకునేందుకే చంద్రబాబు మానసికంగా సిద్ధపడినట్లు తెలుస్తోంది. అందుకనే మోడి వ్యతరేక పార్టీలతో చర్చలు జరుపుతున్నారు.

అయితే, ఉథ్థవ్, మమత తో చంద్రబాబు చర్చల విషయం ప్రధానమంత్రి నరేంద్రమోడికి తెలిసిందట. దాంతో కేంద్రప్రభుత్వం కూడా చంద్రబాబు విషయంలో అలర్ట్ అయ్యింది. ఏపిలో చంద్రబాబు కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు తెలుసుకునేందుకు కేంద్ర నిఘావర్గాలను పూర్తిస్ధాయిలో అలర్ట్ చేసింది. ఉథ్థవ్, మమతతో తాను మాట్లాడిన విషయం ప్రధానికి తెలిసిందన్న విషయ చంద్రబాబుకు కూడా తెలిసిందట. దాంతో చంద్రబాబులో ఆందోళన తారాస్ధాయికి చేరుకున్నది. ఇటువంటి నేపధ్యంలోనే జరుగుతున్న అతవ్యసర సమావేశంలో ఏం నిర్ణయం తీసుకుంటారన్న విషయమై సర్వత్రా ఉత్కంఠ మొదలైంది.