ప్రమాద ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్షాలతో మిత్రపక్షం భాజపా నేతలు కూడా కలవటం తెలుగుదేశం పార్టీకి మింగుడుపడటం లేదు. అయితే, ఇంతమంది ఉన్నతస్ధాయి విచారణకు డిమాండ్
‘ఇసుక మాఫియా ఆగడాలు చూస్తుంటే అసలు రాష్ట్రంలో ప్రభుత్వముందా’. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో ప్రతిపక్ష నేత కాదు. సాక్ష్యాత్తు అధికార టిడిపికి మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ నేత సోము వీర్రాజు. ఎంఎల్సీ సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ, ఏర్పేడు ప్రమాద ఘటన ఆషామాషీ విషయం కాదని అనుమానం వ్యక్తం చేయటం గమానార్హం. ప్రమాదం జరిగిన తీరు చూస్తుంటే అందిరకీ అనేక అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటికే పలువురు తమ అనుమానాలను వ్యక్తం చేయగా వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఏకంగా ప్రమాదంపై సిబిఐ విచారణ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే కదా?
నదులు, వంకలు, వాగులకు ఏకంగా రోడ్లు వేసుకుని మరీ ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా ప్రభుత్వం సంవత్సరాల తరబడి పట్టించుకోకపోవటం విచిత్రంగా ఉందన్నారు. హైకోర్టు హెచ్చరించినా, వనజాక్షి లాంటి అధికారులు అడ్డుకున్నా ఇసుక మాఫియాదే పైచేయిగా నిలుస్తోందని వీర్రాజు ఆరోపణలు చేయటం గమనార్హం. ప్రమాద ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్షాలతో మిత్రపక్షం భాజపా నేతలు కూడా కలవటం తెలుగుదేశం పార్టీకి మింగుడుపడటం లేదు. అయితే, ఇంతమంది ఉన్నతస్ధాయి విచారణకు డిమాండ్ చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో అందరి అనుమానాలు బలపడుతున్నాయ్.
