గంటా ఎక్కడున్న వివాదాస్పదమే. ఎందుకంటే, ఆయన పూర్తి స్ధాయి రాజకీయనేత కాదు. ఒక విధంగా పవర్ బ్రోకర్. రాజకీయాలు, వ్యాపారాలు రెండు కళ్ళు గంటాకు. వ్యాపారాల కోసం, పెట్టుబడుల కోసం గంటా ఎంతకైనా తెగిస్తారు. అందుకు రాజకీయాన్ని అడ్డుపెట్టుకుంటారు.
విశాఖపట్నం భూకుంభకోణంలో మంత్రి గంటా శ్రీనివాసరావు ఇరుక్కున్నట్లేనా? వైసీపీ వర్గాలు చెబుతున్నదాని ప్రకారం అలానే అనిపిస్తోంది. భూకుంభకోణం మొత్తం మొదటినుండి గంటా కేంద్రంగానే తిరుగుతోంది. గంటాతో పాటు మరో ఐదుగురు ఎంఎల్ఏలున్నప్పటికీ గంటానే కుంభస్ధలంగా వైసీపీ భావిస్తోంది. అందుకనే కుంభస్ధలాన్ని కొట్టాలని వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
తాజా వివరాల ప్రకారం గంటా బావమరిది భాస్కర్ రావు, అల్లుడు ప్రశాంత్ పేర్లను తెరపైకి వైసీపీ తెచ్చింది. గంటా ప్రతీ వ్యాపారం వెనుక, ప్రతీ అక్రమం వెనుకా బావమరదే ఉన్నాడన్నది వైసీపీ ఆరోపణ. తాజాగా అల్లుడు ప్రశాంత్ కూడా తోడయ్యారు. గంటా ఎక్కడున్న వివాదాస్పదమే. ఎందుకంటే, ఆయన పూర్తి స్ధాయి రాజకీయనేత కాదు. ఒక విధంగా పవర్ బ్రోకర్. రాజకీయాలు, వ్యాపారాలు రెండు కళ్ళు గంటాకు. వ్యాపారాల కోసం, పెట్టుబడుల కోసం గంటా ఎంతకైనా తెగిస్తారు. అందుకు రాజకీయాన్ని అడ్డుపెట్టుకుంటారు.
ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవటం, సొంతభూములుగా చెప్పుకుని బ్యాంకుల్లో కుదవపెట్టి కోట్లరూపాయలు రుణాలు తీసుకోవటం గంటాకు మామూలు. ఈ విషయం గతంలోనే రుజువైంది. అయినా ఆయనపై చర్యలు తీసుకోవటానికి చంద్రబాబునాయుడుడ వెనకాడుతున్నారు. తాజా కుంభకోణంలో కూడా అదే స్టైల్. ప్రభుత్వ భూములను సొంతం చేసేసుకుని బ్యాంకుల్లో కోట్ల రూపాయలు కుదవపెట్టేసారు. కాబట్టే ఎక్కడున్నా గంటా చుట్టూ వివాదాలు ముసురుకుంటూనే ఉంటాయి.
ఇప్పటి భూకుంభకోణంపై ప్రభుత్వం వేసిన ‘సిట్’ విచారణలో గంటా పూర్తిగా ఇరుక్కున్నట్లే కనబడుతోంది. ఎందుకంటే, కుంభకోణంపై రెండు రకాల విచారణలు జరుగుతున్నాయి. ఒకటి కలెక్టర్ ద్వారా రెవిన్యూ అధికారులు జరుపుతున్న విచారణైతే, రెండోది సిట్. కలెక్టర్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో గంటా బావమరది పాత్రను ప్రముఖంగా ప్రస్తావించారని సమాచారం. అల్లుడు ప్రశాంత్ కూడా కీలక భాగస్వామిగా వైసీపీ ఆరోపణలు చేస్తుండటం గమనార్హం.
