చంద్రబాబును మోసం చేసిన కేంద్రం

చంద్రబాబును మోసం చేసిన కేంద్రం

చంద్రబాబునాయుడు మోసపోయారు. అవును మీరు చదివింది నిజమే. పార్లమెంటు సాక్షిగా  కేంద్రప్రభుత్వమే చంద్రబాబును మోసం చేసింది. ఇంతకీ విషయం ఏమిటంటే బడ్జెట్ పై నిరసనగా నాలుగు రోజుల నుండి ఎంపిలు నిరసన తెలుపుతున్నారు. ఉభయసభల్లోనూ సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, బుధవారం ప్రధానమంత్రి ప్రసంగం సమయంలో మాత్రం టిడిపి ఎంపిలు తమ స్ధానాల్లో కూర్చోగా వైసిపి ఎంపిలు మాత్రం ఆందోళనలు కంటిన్యూ చేశారు.

 ఆ విషయాన్ని టివిల్లో చూసిన వారు ఆశ్చర్యపోయారు. నాలుగు రోజులుగా నిరసనలు తెలుపుతున్న టిడిపి ఎంపిలు ప్రధాని ప్రసంగం సమయంలో మాత్రం తమ సీట్లలో కూర్చోవటమేంటని ఆరాతీసారు. ట్వస్టంతా ఇక్కడే ఉంది. పార్లమెంటులో ఒకవైపు నిరసనలు జరుగుతుండగానే ఇంకోవైపు హోంశాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ చంద్రబాబుకు ఫోన్ చేశారు. కేంద్రంలో భాగస్వామయ్యుండి కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపటం ఎంత వరకూ సబబని ప్రశ్నించారు. ప్రజల మనోభావాలను తెలపటమే లక్ష్యమైతే కనీసం ప్రధానమంత్రి ప్రసంగం సమయంలోనైనా ఆందోళనను విరమించాలని కోరారు.

దాంతో చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారు. వెంటనే తన ఎంపిలకు ఆ మేరకు ఆదేశాలు ఇచ్చారు. దాంతో ఎంపిలు ఆందోళనను నిలిపేసి తమ సీట్లలో కూర్చున్నారు. లోక్ సభతో పాటు రాజ్యసభలో కూడా ప్రధాని ప్రసంగం సమయంలో టిడిపి ఎంపిలు ఆందోళనకు విరామమివ్వగా వైసిపి ఎంపిలు మాత్రం కొనసాగించారు. ప్రధాని ప్రసంగం మొదలైంది అయిపోయింది.

దాదాపు రెండుగంటల పాటు మాట్లాడిన ప్రధాని ఏపికి చేయబోయే సాయంపైన కానీ రాష్ట్రప్రయోజనాలపై కానీ ఒక్క మాట మాట్లాడితే ఒట్టు. దాంతో చంద్రబాబుకు ఒళ్ళు మండిపోయింది. తన ప్రసంగంలో ఏపికి సంబంధించిన ప్రకటన ఏదైనా చేస్తారని చంద్రబాబు అనుకున్నారు. కానీ ప్రధాని మాత్రం అసలటువంటి ప్రయత్నం కూడా చేయలేదు దాంతో హోంశాఖ మంత్రి తనను మోసం చేసినట్లు ఫీల్ అయ్యారట. అయితే, పార్లమెంటులో ప్రధానమంత్రి ప్రసంగం విన్న తర్వాత ఒక విషయం అర్ధమైపోయింది. కేంద్రం నుండి ఏపికి ఒక్కసాయం కూడా అందదన్న విషయం తెలిసిపోయింది.  

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos