డెబిట్ కార్డుదారులకు ఐఆర్ సిటిసి షాక్

Irctc shocks debit card holders
Highlights

  • భారతీయ రైల్వేకు చెందిన ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) డెబిట్‌ కార్డు వినియోగదారులకు షాక్‌ ఇచ్చింది.
  • కొన్ని బ్యాంకుల డెబిట్‌ కార్డుల పేమెంట్‌ గేట్‌వేను బ్లాక్‌ చేసింది.
  • కన్‌వీనియన్స్‌ ఫీజు వివాదం కారణంగా పలు బ్యాంకుల డెబిట్‌కార్డు లావాదేవీలను నిలిపేసింది.
  • ప్రస్తుతానికి ఆరు బ్యాంకులు తప్ప మిగిలిన ఇతర బ్యాంకులకు చెందిన కార్డు లతో ఆన్ లైన్లో రైల్వే టిక్కెట్లు బుక్ చేసుకోవటం సాధ్యం కాదు.  

పండగ సీజన్లో భారతీయ రైల్వేకు చెందిన ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) డెబిట్‌ కార్డు వినియోగదారులకు షాక్‌ ఇచ్చింది. కొన్ని బ్యాంకుల డెబిట్‌ కార్డుల పేమెంట్‌ గేట్‌వేను బ్లాక్‌ చేసింది. కన్‌వీనియన్స్‌ ఫీజు వివాదం కారణంగా పలు బ్యాంకుల డెబిట్‌కార్డు లావాదేవీలను నిలిపేసింది. ప్రస్తుతానికి ఆరు బ్యాంకులు తప్ప మిగిలిన ఇతర బ్యాంకులకు చెందిన కార్డు లతో ఆన్ లైన్లో రైల్వే టిక్కెట్లు బుక్ చేసుకోవటం సాధ్యం కాదు.  

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌తో సహా ఆరు బ్యాంకుల కార్డుదారుల కార్డు చెల్లింపులను మాత్రమే ఐఆర్ సిటిసి అనుమతిస్తోంది. డీమానిటైజేషన్‌ తరువాత కస్టమర్లనుంచి వసూలు చేసే రూ.20 ఫీజును రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీ గత బడ్జెట్ సమావేశాల్లో అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకున్నవారు స్లీపర్ క్లాస్ లో ప్రయాణించేందుకు రూ. 20లను, ఏసీ క్లాస్ లో ప్రయాణించేందుకు రూ.40లను టాక్స్ రూపంలో బ్యాంకులకు చెల్లించాలి. దీనినే ఐఆర్ సిటిసి రద్దు చేసింది. దీనిపై ఎస్బీఐ సీనియర్ అధికారి స్పందిస్తూ ఈ ఫీజు రద్దుతో రోజుకు 50 వేల ట్రాన్సిక్షన్ల పై తమకు  నష్టం వస్తోందన్నారు. అదే సమయంలో ఫీజులో బ్యాంకుల వంతుగా చెల్లించాల్సిన (సగం)సొమ్మును ఆయా బ్యాంకులు ఐఆర్ సిటిసికి చెల్లించకపోవడంతో ఐఆర్‌సీటీసీ  టిక్కెట్టు బుక్కింగ్ ను నిలిపేసింది. ఈ సమస్య ఎప్పటికి పరిష్కారమవుతుందో ఏమో?

loader