విజయనగరం: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 ప్రారంభంతో బెట్టింగ్ రాయుళ్లు కూడా జోరు పెంచారు. ప్రతి మ్యాచ్ పై భారీగా బెట్టింగ్ లు నిర్వహిస్తూ యువతను పెడదారి పట్టిస్తున్నారు. ఇలా ఆన్ లైన్ లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ ముఠాను విజయనగరం పోలీసులు అరెస్ట్ చేశారు. 

పట్టణంలోని ఎలుగుబంటి వారి వీధిలోని ఓ ఇంటిని బెట్టింగ్ కు కేంద్రంగా మార్చుకున్నట్లు విజయనగరం పోలీసులకు సమాచారం అందింది. ఐపిఎల్ సందర్భంగా ఆ ఇంట్లో కంప్యూటర్లతో పాటు ఇతర సాంకేతిక పరికరాలను సమర్చుకుని ఆన్లైన్ చేపడుతోంది ఈ ముఠా.  దీంతో ఆ ఇంటిపై దాడి చేసిన పోలీసులు ఆన్లైన్ లో బెట్టింగ్ కు పాల్పడుతుండగా రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. బెట్టింగ్ కు సంబంధించిన లావాదేవీలను వీరు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా సాగిస్తున్నట్టు  పోలీసులు గుర్తించారు. 

ముంబై వర్సెస్ కోల్‌కత: వరుస ఓటముల చెత్త రికార్డును చెరిపేసిన ముంబై ఇండియన్స్

మంగళవారం రాత్రి రాజస్ధాన్ రాయల్స్  వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ను టీవిల్లో  తిలకిస్తూ లాప్ టాప్, సెల్ ఫోన్లు ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ బెట్టింగ్ ముఠా నుంచి 13 సెల్ ఫోన్స్, అయిదువేలు నగదు, టివి, లాప్ టాప్ లను స్వాధీనం చేసుకున్నట్లు...  తొమ్మిది మందిని అరెస్టు చేసినట్టు విజయనగరం పోలీసులు తెలిపారు.