చైతన్య కాలేజీలో ఇంటర్మీడియట్ చదివే విద్యార్థిని మూడ్రోజులుగా కనిపించకుండా పోవడం పల్నాడు జిల్లా నరసరావుపేటలో కలకలం రేపుతోంది.
నరసరావుపేట : కాలేజీకని ఇంట్లోంచి బయటకు వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన పల్నాడు జిల్లాలో కలకలం రేపుతోంది. తమ బిడ్డ కనిపించకుండాపోయి మూడు రోజులైనా ఏమయ్యిందో తెలియకపోవడంతో తల్లిదండ్రులు కంగారుపడిపోతుంటే కాలేజీ యాజమాన్యం మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. దీంతో యువతి తల్లిదండ్రులు కాలేజీ ముందు కూర్చుని ఆందోళనకు దిగారు. తమ బిడ్డ అదృశ్యంపై కాలేజీ యాజమాన్యమే కాదు రాష్ట్ర విద్యాశాఖమంత్రి, మహిళా కమీషన్ వెంటనే స్పందించాలని బాధిత తల్లిదండ్రులు కోరుతున్నారు.
నరసరావుపేటలోని చైతన్య జూనియర్ కాలేజీలో వైష్ణవి(17) ఇంటర్మీడియట్ చదువుతోంది. కాలేజీకి వెళుతున్నానని చెప్పి మూడ్రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లిన ఆమె ఇప్పటివరకు తిరిగి ఇంటికి చేరుకోలేదు. కూతురు ఆచూకీ కోసం అంతటా గాలించినా పలితం లేకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసారు. అయినప్పటికీ వైష్ణవి ఆఛూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
వీడియో
ఎప్పటిలాగే తమ బిడ్డ కాలేజీకి వచ్చినట్లు సిసి కెమెరాల్లో రికార్డయ్యిందని... అయితే క్లాస్ కు మాత్రం వెళ్లలేదని తెలుస్తోందని తల్లిదండ్రులు చెబుతున్నారు. కాలేజీ నుండి విద్యార్థి అదృశ్యమైనా యాజమాన్యం మాత్రం పట్టించుకోవడం లేదని... ఏం జరగనట్లుగా క్లాసులు చెప్పుకుంటున్నారని బాధిత తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తమ బిడ్డ ఆఛూకీ కనిపెట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
Read More ప్రకాశం జిల్లాలో విద్యార్థినులకు లైంగిక వేధింపులు.. టీచర్లకు దేహశుద్ది..
అయితే వైష్ణవి ఆఛూకీ కోసం నరసరావుపేట పోలీసులు రెండు బృందాలు ఏర్పాటుచేసి గాలింపు చేపట్టారు. యువతి కాల్ డేటాతో పాటు స్నేహితులు, కుటుంబసభ్యుల వివరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. వైష్ణవిని ఎవరైనా కిడ్నాప్ చేసారా? లేక ఆమే ఎక్కడికైనా వెళ్లిపోయిందా? లేక ఇంకేదైనా జరిగిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
