పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన కొందరు టీచర్లు కీచకులుగా మారుతున్నారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు.
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన కొందరు టీచర్లు కీచకులుగా మారుతున్నారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా పుల్లల చెరువు జెడ్పీ హైస్కూల్‌లో ఇలాంటి ఘటన వెలుగుచూసింది. ఇద్దరు విద్యార్థినులపై టీచర్లు లైంగిక వేధింపులు పాల్పడ్డారు. ఇంగ్లీష్ టీచర్ రామకృష్ణ, పీఈటీ బాలు నాయక్‌లు.. విద్యార్థినులను లైంగికంగా వేధించారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు, బంధువులు.. ఇద్దరి దేహశుద్ది చేశారు. విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన టీచర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
