బ్రేకింగ్ న్యూస్: ఎంపిపై ఇంటెలిజెన్స్ నిఘా

బ్రేకింగ్ న్యూస్: ఎంపిపై ఇంటెలిజెన్స్ నిఘా

చంద్రబాబునాయుడును నీడలా వెంటాడుతున్న, అవినీతి ఆరోపణలతో విరుచుకుపడుతున్న వైసిపి ఎంపి విజయసాయిరెడ్డిపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఆ విషయాన్ని స్వయంగా ఎంపినే బయటపెట్టటంతో కలకలం రేగుతోంది.

ఇంతకీ ఏమి జరిగిందంటే, మంగళవారం ఉదయం ఎంపి మీడియా సమావేశోం మాట్లాడారు. ఆ  సమయంలో ఓ వ్యక్తి విలేకరిలాగ వచ్చి అందరితోనూ నిలబడ్డారు. ఆ వ్యక్తిపై ఎంపికి ఎందుకో అనుమానం వచ్చింది. వెంటనే అదే విషయాన్ని  ఆ వ్యక్తి వద్ద ప్రస్తావించారు. ‘మీరు విలేకరి కాదు ఇంటెలిజెన్స అధికారి అన్న విషయం మాకు తెలుసు’ అంటూ విరుచుకుపడ్డారు.

మీడియా సమావేశంలో నిఘా అధికారులకు సంబంధం లేదని కాబట్టి తక్షణమే వెళ్ళిపోవాలన్నారు. దాంతో సదరు అధికారి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయారు. దాంతో విజయసాయిని ఇంటెలిజెన్స్ అధికారులు నీడలాగ వెన్నాడున్నారన్న విషయం అందరికీ అర్ధమైపోయింది.

 

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos