కరణం బలరాం చేతిలో ఫిరాయింపు ఎంఎల్ఏ గొట్టిపాటి రవికుమార్ కు జరిగిన సత్కారం తర్వాత మిగిలిన ఫిరాయింపులెవరూ చొరవగా పార్టీలో కలవలేకపోతున్నారట.
నిన్ననే ముగిసిన మహానాడులో ఫిరాయింపు ఎంఎల్ఏలకు పెద్దగా గుర్తింపు దక్క లేదు. ఫిరాయించిన వారిలో మంత్రులైన అఖిలప్రియ, ఆదినారాయణరెడ్డి, సుజయ కృష్ణ రంగారావు, అమరనాధరెడ్డి తప్ప మిగిలిన వారికి నిజంగా పరాభవమే జరిగింది.
ఎందుకంటే, వారిని టిడిపిలోని సీనియర్లు ఎవరూ పట్టించుకోలేదు. వారంతట వారుగా చొరవతీసుకుని చేయటానికి పనులేమీ లేవక్కడ. దాంతో ఏం చేయాలో చాలామంది ఫిరాయింపు ఎంఎల్ఏలకు దిక్కుతెలీలేదట.
జిల్లా స్ధాయిల్లో జరిగిన మినీమహానాడుల్లోనే వారికి దక్కిన గౌరవం అంతంతమాత్రమే. అటువంటిది రెండు రాష్ట్రాలకు జరిగిన మహానాడులో వారిని ఎవరు లెక్కచేస్తారు? ఫిరాయింపు ఎంఎల్ఏలున్న చాలా నియోజకవర్గాల్లో టిడిపిలోని సీనియర్లకు పడటం లేదు.
అందుకనే టిడిపి శ్రేణులన్నీ ఫిరాయింపు ఎంఎల్ఏలను దూరం పెడుతున్నాయట. దాంతో ఫిరాయింపు ఎంఎల్ఏలను చూస్తుంటే నిజంగానే జాలివేస్తోంది. అందులోనూ మొన్ననే అద్దంకిలో కరణం బలరాం చేతిలో ఫిరాయింపు ఎంఎల్ఏ గొట్టిపాటి రవికుమార్ కు జరిగిన సత్కారం తర్వాత మిగిలిన ఫిరాయింపులెవరూ చొరవగా పార్టీలో కలవలేకపోతున్నారట.
