ప్రియుడితో రాసలీలలు: హత్య చేసి స్కూల్లో పూడ్చిపెట్టారు

illegal affair:4 held for murder case in East godavari district
Highlights

పెళ్లైన ఏడాదిన్నర తర్వాత భర్త హత్య, వివాహేతర సంబంధమే కారణం

జగ్గంపేట: భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకొన్న ఓ వ్యక్తి  పథకం ప్రకారంగా ఆమె భర్తను హత్య చేశాడు. పెళ్లై ఏడాదిన్నర  కూడ కాలేదు. ప్రియుడితో తన రాసలీలలు కొనసాగించేందుకు గాను భర్త అడ్డుతొలగించుకొంది.అయితే ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలంలోని ముక్కోలు గ్రామానికి చెందిన మచ్చా సత్తిబాబు ఈ ఏడాది జూన్ 19వ తేదీన అదృశ్యమయ్యారు. 22వ తేదీ వరకు ఆయన ఆచూకీ కోసం కుటుంబసభ్యులు గాలించారు. కానీ ఆయన ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో కిర్లంపూడి పోలీస్‌స్టేషన్‌లో జూన్ 26వ తేదీన కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. 

ఏడాదిన్నర క్రితం తాటిపర్తికి చెందిన జ్యోతితో  సత్తిబాబుకు వివాహమైంది.  అయితే జ్యోతికి చంద్రమాంపల్లికి చెందిన  యువకుడు చెక్కిడాల రాజాతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం  వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి కారణమైంది. 

తమ మధ్య బంధానికి భర్త సత్తిబాబు అడ్డుగా ఉన్నాడని జ్యోతి భావించింది. ఇదే విషయమై ప్రియుడు చంద్రమాంపల్లికి చెందిన రాజా కూడ భావించాడు.  ఈ క్రమంలోనే సత్తిబాబును చంపాలని ప్లాన్ చేశారు. పథకం ప్రకారంగా సత్తిబాబును ఇద్దరు స్నేహితుల సహాయంతో  చంపేశాడు.

చంద్రమాంపల్లికి సత్తిబాబును రాజా పిలిపించాడు.  అక్కడే నూతనంగా నిర్మిస్తున్న స్కూల్ కాంప్లెక్స్ గదిలో ఇద్దరు స్నేహితులతో కలిసి మద్యం సేవించారు. మత్తులోకి సత్తిబాబు చేరుకోగానే రాడ్‌తో రాజా సత్తిబాబుపై దాడికి దిగాడు.

స్నేహితుల సహాయంతో పాఠశాల ఆవరణలోనే మృతదేహాన్ని పూడ్చిపెట్టారు.సత్తిబాబు అదృశ్యమైన కేసు విచారణలో  పోలీసులకు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి.  రాజాతో వివాహేతర సంబంధం బయటకు వచ్చింది. దీంతో పోలీసులు  విచారణ చేయడంతో  సత్తిబాబును  హత్య చేసిన విషయం వెలుగు చూసింది.

సోమవారం నాడు  చంద్రమాంపల్లి పాఠశాలకు సెలవు ప్రకటించి మృతదేహాన్ని వెలికితీశారు. హత్యకు ఉపయోగించిన రాడ్‌, బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.  పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.

loader