త్వరలో టిడిపి సగం ఖాళీయేనా ?

త్వరలో టిడిపి  సగం ఖాళీయేనా ?

‘వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గనుక అంగీకరిస్తే టిడిపి ఈపాటికే సగం ఖాళీ అయిపోయేది’ ..ఇది చంద్రబాబునాయుడును ఉద్దేశించి వైసిపి ఎంఎల్ఏ రోజా చేసిన సంచలన కామెంట్. ఓ మీడియాకు రోజా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇతర పార్టీల నుండి వైసిపిలోకి చేరాలనుకున్న వాళ్ళెవరైనా సరే ముందు తమ పదవులకు రాజీనామాలు చేయాలన్న విషయం తెలిసిందే కదా? ఈ విషయంలో జగన్ కచ్చితంగా వ్యవహరిస్తున్నారు. టిడిపి నుండి వైసిపిలోకి వచ్చిన ఎంఎల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేసిన తర్వాతే వైసిపిలో చేరిన విషయం అందరకీ తెలిసిందే.

అదే విషయాన్ని రోజా ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తూ, టిడిపి నుండి వైసిపిలోకి రావటానికి చాలా మంది సిద్దంగా ఉన్నట్లు పెద్ద బాంబే పేల్చారు. వైసిపి విషయంలో టిడిపి ఆడుతున్న మైండ్ గేమ్ లాంటిదే రోజా కూడా ఏమన్నా ప్లే చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయిలేండి. పార్టీ మారే విషయమై మాట్లాడుతూ, చాలా మంది ఎంఎల్ఏలు తమ పార్టీలోకి రావటానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

అయితే, జగనే అంగీకరించటం లేదన్నారు. వైసిపిలోకి రాదలచుకున్న వాళ్ళు ఎవరైనా అభ్యంతరం లేదని కాకపోతే ముందుగా ఎంఎల్ఏ పదవులకు రాజీనామాలు చేయాల్సిందే అన్న జగన్ పెట్టిన కండీషన్ వల్లే చాలామంది వెనకడుగు వేసినట్లు రోజా స్పష్టం చేసారు. జగన్ గనుక ‘రాజీనామా’ కండీషన్ పెట్టకపోతే ఈపాటికే టిడిపి సగం ఖాళీ అయిపోయేదన్నారు. ఎన్నికలు దగ్గరకు వచ్చే సమయానికైనా టిడిపి ఖాళీ అవ్వక తప్పదని జోస్యం కూడా చెప్పారు.

వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిరాయింపులుండవని రోజా బల్లగుద్ది మరీ  చెప్పారు. చంద్రబాబునాయుడుకు ఉన్నట్లు జగన్ ది చీప్ మెంటాలిటీ కాదని స్పష్టం చేసారు. ఫిరాయింపు ఎంఎల్ఏలు రాజీనామాలు చేస్తే గెలవటం కష్టమన్న భయంతోనే చంద్రబాబు ఎవరితోనూ  రాజీనామాలు చేయించటం లేదని మండిపడ్డారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos