కర్నూల్: కర్నూల్ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్‌పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది.కరోనాను అదుపు చేయడంలో వైఫల్యం చెందినందున ఆయనను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో  ఐఎఎస్ అధికారి బాలాజీని నియమిస్తూ ప్రభుత్వం గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.

కర్నూల్ మున్సిపల్ కమిషనర్ గా ఉన్న రవీంద్రబాబును ప్రభుత్వం బదిలీ చేసింది. కర్నూల్ జిల్లాలో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో  అత్యధికంగా కర్నూల్ జిల్లాలోనే 386 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ జిల్లాలో ఎక్కువ కేసుల్లో కర్నూల్ నగరంలోనే ఎక్కువగా ఉన్నాయి.

కరోనాను అరికట్టడంలో అధికార యంత్రాంగం వైఫల్యం చెందిందనే విమర్శలు లేకపోలేదు. కరోనాతో మరణించిన  వారి అంత్యక్రియల నిర్వహణలో కూడ నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉదంతాలు కూడ ఈ జిల్లాలో వెలుగు చూశాయి.

also read:ఏపీలో కరోనా విజృంభణ: 24 గంటల్లో 71 కేసులు, మొత్తం 1403కి చేరిక...

కర్నూల్ పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తిని అదుపు చేయడానికి యంత్రాంగం సరైన చర్యలు తీసుకోలేదనే నెపంతో రవీంద్రబాబుపై  బదిలీ చేసింది. రవీంద్రబాబు స్థానంలో ఐఎఎస్ అదికారి బాలాజీని నియమించినట్టుగా సమాచారం. కర్నూల్ పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడంపై మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు.

గతంలో నగరి మున్సిపల్ కమిషనర్ ఎమ్మెల్యే రోజాను పొగిడారు. కరోనా సహాయంలో ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఎమ్మెల్యే రోజా సహాయం చేయడం వల్లే కరోనా కట్టడిపై చర్యలు తీసుకొంటున్నట్టుగా  సెల్పీ వీడియో కలకలం రేపడంతో ఆయనను ప్రభుత్వం సస్నెండ్ చేసిన విషయం తెలిసిందే.