ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో మరో 71 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1403కి చేరుకొన్నాయి.

గత 24 గంటల్లో 6497 మంది శాంపిల్స్ పరీక్షించారు. వీరిలో 71 మందికి కరోనా సోకినట్టుగా తేలిందని ఏపీ ప్రభుత్వం గురువారం నాడు ప్రకటించింది. ఇప్పటివరకు 321 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ వైరస్ సోకి 31 మంది మరణించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 1051గా ఉందని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

 

గత 24 గంటల్లో నమోదైన 71 కేసుల్లో కర్నూల్ జిల్లాలోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. కర్నూల్ జిల్లాలో 43 కేసులతో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది. గుంటూరులో 4, కడపలో 4, అనంతపురంలో 3, చిత్తూరులో 3, కృష్ణాలో 10, నెల్లూరులో 2 కేసులు నమోదయ్యాయి.

also read:లారీ డ్రైవర్ కు కరోనా... ఇక విజయవాడ నుండి కూరగాయల నిషేధం...

రాష్ట్రంలో అత్యధికంగా కర్నూల్ జిల్లాలో 386  కేసులు నమోదయ్యాయి. కర్నూల్ తర్వాతి స్థానంలో గుంటూరు నిలిచింది. గుంటూరులో 287 కేసులు నమోదయ్యాయి.గుంటూరు తర్వాత కృష్ణా జిల్లా నిలిచింది.కృష్ణాలో 246  కేసులు నమోదయ్యాయి. నెల్లూరులో 84,చిత్తూరులో 80, కడపలో 73,అనంతపురంలో 61,ప్రకాశంలో 60,పశ్చిమగోదావరిలో 56, తూర్పు గోదావరిలో 42,శ్రీకాకుళంలో 5 కేసులు నమోదయ్యాయి.