పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెంపుతో పాటు తనపై మోపిన తప్పుడు కేసులపై త్వరలోనే మాట్టాడుతానని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రకటించారు.  ట్విట్టర్ వేదికగా దేవినేని ఈ విషయాన్ని ప్రకటించారు.

అమరావతి: పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెంపుతో పాటు తనపై మోపిన తప్పుడు కేసులపై త్వరలోనే మాట్టాడుతానని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా దేవినేని ఈ విషయాన్ని ప్రకటించారు.ఈ ఏడాది మార్చి 15న, ఏప్రిల్ 15న కరోనా వ్యాక్సిన్ తీసుకొన్నట్టుగా ఆయన ప్రకటించారు. వైద్యుల సలహామేరకు కరోనా రక్షణ చర్యలు తీసుకొంటున్నట్టుగా ఆయన ప్రకటించారు.

also read:జగన్ మార్ఫింగ్ వీడియో కేసు: ఇంటికి సిఐడి పోలీసులు, అజ్ఞాతంలోకి దేవినేని ఉమా

ఏపీ సీఎం వైఎస్ జగన్ పై మార్పింగ్ వీడియోను మీడియా సమావేశంలో ప్రదర్శించారని కర్నూల్ కు చెందిన న్యాయవాది నారాయణరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దేవినేని ఉమామహేశ్వర్ రావుపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ విషయమై విచారణకు హాజరుకావాలని సీఐడీ నోటీసులు జారీ చేసింది. 

Scroll to load tweet…

ఈ నెల 20వ తేదీన దేవినేని ఉమా ఇంటికి కర్నూల్ నుండి సీఐడీ అధికారులు వచ్చారు. అయితే సీఐడీ అధికారులు దేవినేని ఉమా ఇంటికి వెళ్లిన సమయంలో ఆయన ఇంట్లో లేరు. దేవినేని అజ్ఞాతంలోకి వెళ్లినట్టుగా సీఐడీ గుర్తించింది. ఆయన ఫోన్ కూడ స్విచ్ఛాఫ్ చేసి ఉంది. కుటుంబసభ్యులు కూడ తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారని సీఐడీ అధికారులు తెలిపారు.ఈ నెల 10న దేవినేని ఉమాపై కర్నూల్ లో సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ నెల 15న విచారణకు రావాలని సీఐడీ అధికారులు నోటీసులిచ్చారు. ఈ నెల 19న కూడ విచారణకు రావాలని రెండోసారి నోటీసిచ్చారు కానీ ఆయన విచారణకు హాజరుకాలేదు.

రెండు రోజుల క్రితమే దేవినేని ఇంటి నుండి వెళ్లిపోయారని కుటుంబసభ్యులు సీఐడీ అధికారులు తెలిపారు.