తన రాజీనామా పత్రాన్ని చూసిన శిల్పా చక్రపాణి. బాబు తమకి చేసింది ఎమీ లేదు. జగన్ మాట ఇస్తే చేసే దాక వదులడు
టిడిపి ఎమ్మేల్సీ పదవికి రాజీనామా చేసి వేలాది మంది మధ్య తన రాజీనామా పత్రాన్ని చూపించారు శిల్పా చక్రపాణి. ఆయన తన రాజీనామా పత్రాన్ని ప్రజలకు చూపిస్తు చాలేంజ్ విసిరాడు నేను నా ఎమ్మేల్సీ పదవికి రాజీనామా చేశాను ఇక దమ్ముంటే ఇక రండి అని సవాల్ విసిరారు.
తమ సోధరులను వైఎస్ఆర్ బాగా చూసుకున్నారని, ఇప్పుడు చిన్నాయన ఎలా చూసుకుంటారో... చూడాలి అని చక్రపాణి అన్నారు. ఆ మాటలకు సభపై ఉన్న నాయకులు, సభకు వచ్చిన ప్రజలు నవ్వారు. జగన్ చాలా మంచి మనిషి అన్నారు. తమ పైనా చాలా నమ్మకం ఉందని అందుకే వైసీపిలో చెరినట్లు ఆయన పెర్కోన్నారు.
తాను మూడున్నర సంవత్సరాలు టిడిపిలో ఉన్నాను, కానీ తనకి సరైనా న్యాయం జరగలేదని ఆయన ఆరోపించారు, చంద్రబాబు నాయుడు మాట ఇస్తే చేయ్యడని కానీ జగన్ మాట ఇస్తే చేసేదాక వదలడు అని ఆయన తెలిపాడు. టిడిపి నంద్యాలలో మత సామరస్యాన్ని మంటగల్పుతున్నారని విమర్శించారు. మతాల ప్రాతిపాధిక ఓట్లు కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. లోకేష్ తమపై అసత్య ప్రచారం చెస్తున్నారని ఆరోపించారు. తాము చీమకు కూడా హానీ చెయ్యలేదని, ఇన్నాళ్లు నంద్యాల అభివృద్ది కోసం పాటుపడ్డామని ఇక మీదట కూడా వైసీపితో కలిసి నంద్యాల కోసం కృషి చేస్తామని ఆయన తెలిపారు.
