బాబు నిర్ధోషిగా తేలితే రాజకీయ సన్యాసం తీసుకొంటా: విజయసాయి రెడ్డి

I dont know about ttd notices says ysrcp mp vijayasai reddy
Highlights

బాబుపై విజయసాయిరెడ్డి ఘాటు విమర్శలు

హైదరాబాద్: టిటిడి విషయంలో తాను చేసిన ఆరోపణలపై విచారణ చేస్తే అసలు విషయాలు వెలుగు చూస్తాయని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పారు. ఈ విచారణలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిర్ధోషిగా తేలితే తాను  రాజకీయ సన్యాసం తీసుకొంటానని చెప్పారు.

బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. టిటిడి నుండి తనకు ఎలాంటి నోటీసులు రాలేదని ఆయన చెప్పారు. నోటీసులు జారీ చేసినట్టుగా  మీడియాలో వార్తలు చూశానని ఆయన చెప్పారు. తనకు ఇంతవరకు ఎలాంటి నోటీసులు అందలేదన్నారు. 


ఒకవేళ నోటీసులు అందితే చట్టపరంగా ఎదుర్కొంటానని ఆయన చెప్పారుఅసలు నోటీసులు ఇచ్చే అధికారం టిటిడికి లేనే లేదని ఆయన చెప్పారు. టిటిడిలో చోటు చేసుకొన్న అక్రమాలపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. 

loader