Asianet News TeluguAsianet News Telugu

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ సమయంలో నాకు ఆ శాఖ లేదు - టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

స్కిల్ డెవల్ మెంట్ స్కామ్ జరిగిందని చెబుతున్న సమయంలో తాను ఆ శాఖకు బాధ్యత వహించలేదని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల తాను గానీ, తన కుటుంబం గానీ ఒక్క రూపాయి కూడా లబ్ది పొందలేదని తెలిపారు.

I didn't have that department during skill development scam: TDP AP President Achchennaidu..ISR
Author
First Published Sep 11, 2023, 8:41 AM IST

స్కిల్‌  డెవలప్ మెంట్ స్కామ్ జరిగిందని చెబుతున్న టైమ్ లో తనకు, ఆ శాఖకు సంబంధం లేదని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఆ సమయంలో తాను ఆ శాఖకు బాధ్యత వహించలేదని చెప్పారు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు మొదటగా విద్యాశాఖ పరిధిలో ఉండేదని అన్నారు. అయితే దానిన తరువాత కార్మిక శాఖకు అనుసంధానం చేశారని తెలిపారు.

నందివాడ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ శీరిష భర్త అనుమానస్పద మృతి.. హత్యేనని కుటుంబ సభ్యుల ఆరోపణ..

ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఈ ప్రాజెక్టు వల్ల తన కుటుంబం గానీ, తాను గానీ లబ్ది పొందలేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. దీని వల్ల తమకు ఒక్క రూపాయి అయినా వచ్చిందని రుజురు చేస్తే పీక కోసుకుంటానని సవాల్ విసిరారు. టీడీపీ ప్రభుత్వ కేబినేట్ లో ఎంతో మంది విద్యావంతులు ఉన్నారని చెప్పారు. కానీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, తాను కలిసి ఏదో కుట్ర చేశామని పేర్కొనడం చూస్తే ఆశ్చర్యం వేస్తోందని అన్నారు.

ధైర్యంగా ఉండండి.. జగన్ అరాచకాలపై ఐక్యంగా పోరాడుదాం - నారా లోకేష్ కు పవన్ కల్యాణ్ ఫోన్..

రెండు సంవత్సరాల కిందట కేసు నమోదు చేశారని అచ్చెన్నాయుడు తెలిపారు. ఆ సమయంలో అందులో చంద్రబాబు నాయుడు పేరు, అలాగే తన పేరు కూడా అందులో లేదని చెప్పారు. మరి ఇప్పుడు ఆయనను ఎలా అరెస్టు చేశారని ప్రశ్నలు సంధించారు. అప్పటి కేబినేట్ లో చర్చించిన తరువాతే ఈ స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు విషయం తుది నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

గుడి దగ్గర మూత్ర విసర్జన చేయొద్దని చెప్పినందుకు.. విద్యార్థిని కారుతో ఢీకొట్టి హత్య..

ఈ స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు వల్ల ఎంతో మంది నిరుద్యోగ యువత లాభ పడ్డారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. సీబీఐ ఆరోపిస్తున్నట్టు 371 కోట్లు రూపాయిల అవినీతి జరగలేదని అన్నారు. ఆ సమయంలో ఈ స్కీమ్ ను అజేయ కల్లం, ప్రేమ చంద్రారెడ్డి అమలు చేశారని తెలిపారు. మరి వారి పేరు ఎందుకు ప్రస్తావించలేదని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. రాజకీయ కక్షతోనే ఈ కేసు పెట్టారని ఆయన ఆరోపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios