నందివాడ సబ్ ఇన్‌స్పెక్టర్ శీరిష భర్త అనుమానస్పద మృతి.. హత్యేనని కుటుంబ సభ్యుల ఆరోపణ..
కృష్ణా జిల్లా నందివాడ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గా పని చేస్తున్న శీరిష భర్త ఆత్మహత్య చేసుకున్నారు. అయితే అతడి కుటుంబ సభ్యులు, బంధువులు ఇది హత్యే అని ఆరోపణలు చేస్తున్నారు.
ఏపీలోని కృష్ణా జిల్లా నందివాడ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పని చేస్తున్న శిరీష భర్త అనుమానస్పదంగా మరణించారు. గుంటూరు జిల్లాకు చెందిన 30 ఏళ్ల బి.అశోక్ ఇంట్లోనే ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొంత సమయం తరువాత భార్య శిరీష, ఇతర బంధువులు దీనిని గుర్తించారు. వెంటనే గుడివాడ ఏలూరు రోడ్ లో ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. కానీ అప్పటికే ఆయన చనిపోయారని డాక్టర్లు చెప్పారు.
ధైర్యంగా ఉండండి.. జగన్ అరాచకాలపై ఐక్యంగా పోరాడుదాం - నారా లోకేష్ కు పవన్ కల్యాణ్ ఫోన్..
కాగా.. అతడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే వివరాలు తెలియడం లేదు. ఆదివారం సాయంత్రం ఆయన చనిపోయారు. డెడ్ బాడీని ఆ ప్రైవేట్ హాస్పిటల్ లోనే ఉంచారు. ఈ ఘటనపై రాత్రి 10 గంటలకు వరకు కేసు బుక్ కాలేదు. ప్రస్తుతం నందివాడ ఎస్ఐగా పని చేస్తున్న శిరీష స్వస్థలం ఏలూరు. ఆమె భర్త బి.అశోక్ గుంటూరు జిల్లాలోని పెదకాకానికి చెందిన వాడు.
గుడి దగ్గర మూత్ర విసర్జన చేయొద్దని చెప్పినందుకు.. విద్యార్థిని కారుతో ఢీకొట్టి హత్య..
అయితే వీరిద్దరూ ప్రేమించుకున్నారు. కులాలు వేరైనప్పటికీ రెండు సంవత్సరాల కిందట వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఏడాది కూతురు ఉంది. శీరిష 4 నెలల కిందటి వరకు మచిలీపట్నంలోని స్పెషల్ బ్రాంచ్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. తరువాత ట్రాన్సఫర్ పై నందివాడకు వచ్చారు. ఓ ఇల్లు అద్దెకు తీసుకొని అందులోనే నివాసం ఉంటున్నారు. కాగా.. అశోక్ ఆత్మహత్య చేసుకోలేదని, ఇది హత్యే అని అతడి తరుఫు బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు.