రెండో భార్య ముందు.. విడాకులిచ్చిన మొదటి భార్య చేసిన ఇన్ స్టా రీల్స్ చూశాడో భర్త. కోపానికి వచ్చిన ఆమె అతని మర్మాంగాన్ని కోసేసింది. 

ఎన్టీఆర్ జిల్లా : ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ భార్య భర్త మర్మాంగాలను కోసేసింది. కారణం ఏంటంటే.. అతను తన మొదటి భార్య ఇన్ స్టా రీల్స్ చూస్తున్నాడట. దీంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెడితే.. నందిగామలోని అయ్యప్పనగర్ లో ఈ ఘటన వెలుగు చూసింది. 

కోట ఆనంద్ బాబు అనే వ్యక్తి ముప్పాళ్ళ గ్రామ నివాసి. అతను మొదట ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజులకే వీరిద్దరి మధ్య విబేధాలు రావడంతో విడిపోయారు. ఆ తరువాత వరమ్మ అనే మహిళను ఐదేళ్ల క్రితం రెండో పెళ్ళి చేసుకున్నాడు. అప్పటి నుంచి వీరిద్దరూ ముప్పాళ్లలోనే కాపురం ఉంటున్నారు. ఆనంద్ బాబు శుక్రవారం రాత్రి మొదటి భార్య చేసిన ఇన్ స్టా రీల్స్ చూస్తున్నాడు. 

జగన్ సర్కార్‌పై మరోసారి ఫైర్.. యాప్స్ చాయిస్, టీచర్ మస్ట్.. బైజూస్‌కు కాంట్రాక్ట్‌పై పవన్ ప్రశ్నలు..

అది వరమ్మ కంట పడింది. దీంతో ఆమెకు తీవ్రంగా కోపం వచ్చింది. అగ్గిమీద గుగ్గిలం అయ్యింది. భర్త ఆనంద్ బాబుపై విరుచుకుపడింది. ఆమె రీల్స్ ఎందుకు చూస్తున్నావంటూ వాగ్వాదానికి దిగింది. ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కొట్టుకున్నారు. అసహనానికి గురైన వరమ్మ ఆనంద్ మీద దాడిచేసి.. బ్లేడుతో మర్మాంగాలను కోసేసింది. 

దీంతో ఆనంద్ కు తీవ్ర రక్తస్రావం అయ్యింది. వెంటనే అది గమనించిన కుటుంబసభ్యులు ఆనంద్ బాబును ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన తరువాత మెరుగైన చికిత్స కోసం విజయవాడకు ఆనంద్ ను తరలించారు. 

ఇదిలా ఉండగా, మార్చిలో ఇలాంటి ఘటనే తమిళనాడులో చోటు చేసుకుంది. రీల్స్ చేయడం చిన్నా, పెద్దా అందరికీ ఓ అలవాటుగా మారిపోయింది. అలవాటు అనేకంటే అడిక్షన్ అనడం కరెక్టేమో. ఎందుకంటే రీల్స్ పిచ్చితో ఓ తొమ్మిదేళ్ల చిన్నారి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులో కలకలం రేపింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 

రాష్ట్రంలోని తిరువళ్లువార్ కు చెందిన ప్రతిషా అనే అమ్మాయి సోషల్ మీడియాలో రీల్స్ చేస్తుండేది. ప్రతిషా వయసు 9 సంవత్సరాలు. ఆ వయసులో చదువుకోకుండా రీల్స్ చేయడం సరికాదని తండ్రి ఆమెను మందలించాడు. చదువు మీద దృష్టి సారించాలని గట్టిగా చెప్పాడు. దీంతో చిన్నారి తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇంట్లో నుంచి తండ్రి బయటికి వెళ్ళగానే గదిలోకి వెళ్లి ఫ్యాన్కు ఉరి వేసుకుంది. 

ఇది గమనించిన ఇంట్లోని మిగతా కుటుంబ సభ్యులు వెంటనే ప్రతీషాను ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆ చిన్నారిని పరీక్షించి అప్పటికే ఆమె మృతి చెందినట్లుగా నిర్ధారించారు. అనుకోకుండా జరిగిన ఈ ఘటనతో ఆ కుటుంబం శోకంలో మునిగిపోయింది. 

చదువుకోమని తండ్రి చెప్పడమే తప్పుగా మారింది. ఈ విషాద ఘటన స్థానికంగా కూడా చర్చనీయాంశంగా మారింది. దీనిమీద పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.